Rajiv Yuva Vikasam Scheme Guidelines 2025
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రతి ఒక్క నిరుద్యోగికి 5 లక్షల రుణ సదుపాయం కల్పించి వారికి ఉపాధి కల్పిస్తాం అని కొత్త పథకాన్ని అమలు చేసింది ఆ పథకం గైడ్లైన్స్ విడుదల చేసింది.
తెలంగాణలో బాక్వర్డ్ చ్లస్సెస్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించి వారికి ఒక బ్రతుకు దెరువు చూపించాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున్న 6000 కోట్ల తో రాజీవ్ యువ వికాసం అనే పథకాన్ని అమలు చేశారు ఈ పథకాన్ని మార్చ్ 15 నుండి అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది.అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 5 వరకు అప్లికేషన్ చేయవచ్చు.ఈ పథకం విడుదల ఐన దగ్గరనుంచి ప్రతి ఒక్కరికి ఈ పథకానికి ఎలా అప్లై చేయాలి ఎవరు అర్హులు అనేదానిపై క్లారిటీ లేదు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు క్లారిటీ ఇవ్వడం జరిగింది.ఈ పథకానికి సంబంధించి విది విధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది అవి ఒక్కసారి చూద్దాం
విది విధానాలు
- 5 ఏళ్లలో ఒక్కో కుటుంబం ఒక్కసారి మాత్రమే లబ్ధి పొందాలి
- 50 వేళ లోపు ఋణం తీసుకున్నట్లైతే 100 శాతం సబ్సిడీ
- కుటుంబాల వార్షిక ఆదాయం పట్టణాల్లో రూ.2లక్షలు, పల్లెల్లో రూ.1.50లక్షలలోపు ఉండాలి
- రేషన్ కార్డు లేకపోతే ఇన్కం సర్టిఫికెట్ సమర్పించాలి
- ( మహిళలకు (ఒంటరి, వితంతు) 25%, దివ్యాంగులకు 5% రిజర్వేషన్
- అమరవీరుల కుటుంబాలు, స్కిల్స్ ఉన్న వారికి ప్రాధాన్యత
- రేషన్ కార్డు తప్పనిసరి. ఒకవేళ లేకపోతే ఇన్కం సర్టిఫికెట్ సమర్పించాలి
- 21 నుంచి 55 సంవత్సరాల వరకు వయస్సు ఉన్న వాళ్లు ఈ పథకం కింద లబ్ది పొందడానికి అర్హులు.
- వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు చెందిన వాళ్లకు సడలింపు ఉంది.
- 60 సంవత్సరాల వయస్సు ఉన్న వాళ్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించే క్రమంలో ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.
- ఆధార్, కుల ధ్రువీకరణ పత్రం, పాస్పోర్ట్ సైజ్ ఫొటో
- IS ట్రాన్స్పోర్ట్ వెహికల్కు అప్లె చేస్తే డ్రైవింగ్ లైసెన్స్
- అగ్రికల్చర్ యూనిట్కి అప్లై చేస్తే పట్టాదారు పాస్ బుక్
- దివ్యాంగ అభ్యర్థులైతే సదరం సర్టిఫికెట్ జతచేయాలి.
- ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తులు ఆన్లైన్ అప్లికేషన్ పూర్తయ్యాక దానిని డౌన్లోడ్ చేసి MPDO లేదా మున్సిపల్/జోనల్ కమిషనరు సమర్పించాలి.
ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు మైనార్టీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం 3 లక్షల రూపాయల వరకు రుణాలు మంజూరు చేయనుంది. ఇందులో 60 శాతం నుంచి 80 శాతం వరకు రాయితీ లభిస్తుంది. దాదాపు 5 లక్షల మందికి 6,000 కోట్ల మేర ఈ రుణాలను అందించనుంది.పూర్తి వివరాల కోసం https://tgobmms.cgg.gov.in/ ను దర్శించవచ్చు. దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 5వ తేదీన ముగిసిన వెంటనే అంటే ఏప్రిల్ 6 నుంచి మే 31వ తేదీ వరకు వాటిని సంబంధిత అధికారులు పరిశీలిస్తారు. వాటిని వడపోస్తారు. అనంతరం లబ్ధిదారుల జాబితాను విడుదల చేస్తారు