Telangana CM Releasing Digital Ration Cards
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల అమలకు సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల అమలులో లేని జిల్లాల్లో రేషన్ కార్ల పంపిణీ జరగాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణలో గత గత పది సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డుల అమలు జరగకపోవడంతో లక్షల్లో ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. దీనికోసం అని రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులో అమలు ప్రక్రియ వెంటనే జరగాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఇప్పటికే పలుమార్లు కొత్త రేషన్ కార్డుల కోసం అప్లికేషన్లు తీసుకున్న కూడా మీ సేవలో ముందు భారీ ఎత్తున ప్రజలు నిలిచి ఉండడం ఏంటని వివరాలు కనుక్కున్నారు సీఎం రేవంత్ రెడ్డి వీటికి సమాధానం గ అప్లై చేసుకున్నవారే మళ్లీ మళ్లీ అప్లై చేసుకుంటున్నారు అని పౌరసరఫరాల అధికారులు తెలపడంతో వారిని మళ్లీ అప్లై చేసుకోకుండా చేయడం కోసం ఎలక్షన్ కోడ్ అమల్లో లేని జిల్లాలో వెంటనే కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు రాబోయే కొత్త రేషన్ కార్డులు మహిళా పేరుమీద రానున్నాయి ఇవి స్మార్ట్ కార్డుల రూపంలో ఉండలున్నాయి ఏటీఎం కార్డు ఎంత సైజులో ఉండి రేషన్ షాపుల్లో ఏటీఎం మాదిరి స్వైప్ చేయవచ్చు.
ఖమ్మం, నల్లగొండ, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో మాత్రం ఎన్నికల కోడ్ అమల్లో లేదు. సీఎం ఆదేశాలతో ఈ మూడు జిల్లాల్లో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ షురూ కానుంది.త్వరగా కొత్త రేషన్ కార్డులు ఇచ్చి ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామని చెప్పింది ప్రభుత్వం.









