Rythu Bharosa Scheme Eligibility Survey Start : సర్వే సమయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతు భరోసా ఇవ్వడం కోసం నిన్నటినుంచి రైతు ల భూములను సర్వే చేయడం ప్రారంభించింది.పంచాయతీ రాజ్, మండల రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు అంటే ఫీల్డ్ అసిస్టెంట్, విలేజ్ అసిస్టెంట్, జీపీఎస్ స్పెషలిస్ట్, ఆర్ఏ, ఏఈఓలు పాల్గొననున్నారు.ఈ సర్వే జరుగ్గుతున్న సమయంలో ఎం ధ్రువపత్రాలు చూపించాలి మరియు మనం ఉండాలి లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26 న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎలక్షన్ హామీ ఐన రైతు భరోసా 12 వేళా రూపాయలను నేరుగా డీబీటీ ప్రక్రియ ద్వారా రైతుల ఖాతాలో జమ చేయనుంది.గతంలో సీఎం రేవంత్ రెడ్డి రైతు బంధు పథకం ద్వారా చాల మటుకు నిధుల దుర్వినియోగం జరిగిందని ఇప్పుడు ఆలా జరగబోదని చెప్పారు. దీని కోసం అని ససాగుకు యోగ్యమైన అన్ని భూములకు రైతు భరోసా ఇస్తాం అని అన్నారు.
సాగుభూల వివరాలను తెలుసుకోవడం కోసం శాటిలైట్ డేటా సెంటర్ల నుండి డేటా ను తెప్పించుకున్నామని అన్నారు అవి నిజంగా ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవడం కోసం మూడు బృందాలుగా వెళ్లి అధికారులు 10 రోజులు సర్వే చేయనున్నారు.సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లు మూడు టీములుగా విడదీసి ఈ సర్వేను కొనసాగించనున్నారు. తనిఖీ బృందాల్లో పంచాయతీ రాజ్, మండల రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు అంటే ఫీల్డ్ అసిస్టెంట్, విలేజ్ అసిస్టెంట్, జీపీఎస్ స్పెషలిస్ట్, ఆర్ఏ, ఏఈఓలు ఉంటారు.
ఈ సర్వేలో భాగంగా రైతుల బహుళ యొక్క సర్వే నెంబర్ ప్రకారంగా ఈ సర్వే చేయనున్నారు.ఊరిలోకి వెళ్లిన వెంటనే గ్రామా సభను నిర్వహించి ఆ తర్వాత సర్వే ప్రారంభిస్తారు.వీళ్లు వచ్చినప్పుడు రైతులు దగ్గరే ఉండి.. పొలాలను చూపించాలి.సాగుకి యోగ్యం కావు అని అధికారులు అంటే.. యోగ్యమే అని రైతు అనుకుంటే, ఎలా యోగ్యమో అధికారులకు వివరించాలి. లేదంటే రైతులు అనుకున్నంత మనీ రాదు. అలా రాకపోతే రైతులు నష్టపోతారు.
ఈ బృందాల దగ్గర ట్యాబ్స్ లో రైతు భరోసా యాప్ ఉంటుంది. ఆ యాప్‌కి శాటిలైట్, జీపీఎస్ ట్రాకింగ్ సిస్టం ఉంటుంది. అందువల్ల తనిఖీ బందాలు.. పొలాల్లోకి వెళ్లి యాప్ ఓపెన్ చేసి.. భూములను గుర్తిస్తారు. అలా.. అత్యంత కచ్చితమైన పద్ధతిలో ఈ సర్వే జరుగుతుంది. ఇలా సర్వే చేసిన తర్వాత ఈ తనిఖీ బృందాలు.. పూర్తి వివరాలను యాప్‌లో నమోదు చేస్తాయి. దాంతో.. రైతు పేరు, ఎన్ని ఎకరాలు, ఎంత మనీ ఇవ్వాలి.. అనేది.. లిస్ట్ రెడీ అవుతుంది. ఈ జాబితాను జనవరి 25న ప్రభుత్వానికి ఇస్తారు. 26న ప్రభుత్వం మనీ రిలీజ్ చేస్తుంది.
ఆ డబ్బు రైతుల అకౌంట్లలో జమ అవ్వడానికి ఓ వారం, 10 రోజులు పట్టొచ్చు. ఇంతకు ముందు ఆ సర్వే నంబర్లో సాగు భూమి ఉంది ఇప్పుడు సాగుభూమి లేకుండా వెంచర్లు గాని రాళ్ళూ ,రప్పలు గాని ఇండ్లు కట్టుకున్న లేదా పాడగుగా ఉన్న,ఆ భోమి ప్రభుత్వ ప్రాజెక్టు నిమిత్తం తీసుకున్నట్లు ఉన్న ఆ భూమి సాగు యోగ్యమైనది కాదు అని బ్లాక్ చేస్తారు.రైతు నుంచి పూర్తి సమాచారం సేకరించి సాగు యోగ్యం కానీ భూములను నేరుగా అధికారులు వెళ్లి చూసిన తరువాతే రైతు భరోసా ఫోరంలో రాస్తాం అని అన్నారు.
ఒకవేళ అధికారులు తనిఖీ, సర్వే కోసం వచ్చినప్పుడు సంబంధిత పొలాల రైతు అందుబాటులో లేకపోతే, అధికారులు తాము తయారుచేసిన లిస్టును ప్రకటించకముందే.. గ్రామ సభల్లో ఆ జాబితాను ప్రకటిస్తారు. అప్పుడు మిస్సయిన రైతులు ఆ జాబితాను పరిశీలించి, ఏదైనా సమస్య ఉంటే అధికారులకు చెప్పొచ్చు. అప్పుడు వాళ్లు పరిశీలించి, సమస్యలను సరిచేస్తారు. అందువల్ల ఇవాళ్టి నుంచి 3 రోజులు.. రైతులు అప్రమత్తంగా ఉండి, తమ దగ్గరున్న వ్యవసాయ యోగ్యమైన పొలాలను చూపించాలి. అలాగే.. 26వ తేదీ డబ్బు వచ్చే వరకూ.. అప్రమత్తంగా ఉండి, మనీ పొంది తీరాలి.