That’s why he stabbed Saif 2025: హీరో సైఫ్ అలీఖాన్పై దాడికి యత్నించిన నిందితుడు

Photo of author

By Admin

That’s why he stabbed Saif 2025: హీరో సైఫ్ అలీఖాన్పై దాడికి యత్నించిన నిందితుడు

హీరో సైఫ్ అలీఖాన్పై దాడికి యత్నించిన నిందితుడు తొలుత అతడి కొడుకు జేహ్(4) బెడ్రూమ్లోకి ప్రవేశించినట్లు పోలీసులు FIR కాపీలో తెలిపారు.

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్పై దాడి ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు ఇంట్లోకి చొరబడి దాడి చేసే ముందు సైఫ్ను రూ.కోటి డిమాండ్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీనికి ఒప్పుకోకపోవడంతో అగంతకుడు దాడి చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే బయటకొచ్చే అవకాశం ఉంది.ప్రస్తుతం సైఫ్ ఆరోగ్యం నిలకడగా ఉంది.

హీరో సైఫ్ అలీఖాన్పై దాడికి యత్నించిన నిందితుడు తొలుత అతడి కొడుకు జేహ్(4) బెడ్రూమ్లోకి ప్రవేశించినట్లు పోలీసులు FIR కాపీలో తెలిపారు. ‘బాబు సంరక్షణ కోసం ఉన్న నర్సు నిందితుడిని నిలువరించింది. దీంతో అతడు ఆమెపై దాడి చేయడంతో గాయాలయ్యాయి. అలికిడి విని సైఫ్, కరీనా ఆ గదిలో వెళ్లారు. పెనుగులాటలో దుండగుడు సైఫ్ను కత్తితో పొడిచి పారిపోయాడు’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం సైఫ్ ఆసుపత్రిలో కోలుకుంటున్నారు.ముంబైలోని సైఫ్ నివాసంలోకి అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తి ఆయన పనిమనిషితో వాగ్వాదానికి దిగాడు. సైఫ్ జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించగా దుండగుడు కత్తితో అటాక్ చేసి, పరారయ్యాడు. దీంతో ఈ నటుడికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సర్జరీ చేయాల్సి ఉందని వైద్యులు తెలిపారు.

బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ను ఆగంతుకుడు ఆరుసార్లు కత్తితో పొడిచారని లీలావతీ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అందులో రెండు గాయాలు మరీ లోతుగా ఉన్నాయని పేర్కొన్నాయి. న్యూరోసర్జన్ డాక్టర్ డింగే, కాస్మొటిక్ సర్జన్ డాక్టర్ జైన్ ఆయనకు సర్జరీ చేస్తున్నట్లు వెల్లడించాయి. సైఫ్ను చూసేందుకు భార్య కరీనా, ఆమె సోదరి రిష్మా ఉదయం 4:30 గంటలకే ఆస్పత్రికి వచ్చారని తెలిసింది. దాడిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Comment