MLA Padi Koushik Reddy vs MLA Sanjay in KNR 2025: ఆయనకు కెసిఆర్ భిక్ష వేసారే తప్ప ఆయన సొంతంగా వచ్చింది కాదు
కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ మరియు టిఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం జరిగి తోపులాట చేసుకున్నారు దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది..
రాష్ట్రంలో రాజకీయ వేడి పుంజుకుంటుంది కలెక్టరేట్లో సమీక్ష సమావేశం సందర్భంగా టిఆర్ఎస్ మరియు కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పరస్పరం తోసుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది దీన్ని పోలీసులు మధ్యలో కలగజేసుకొని కౌశిక్ ను బయటకు లాకెళ్ళారు సంజయ్ మాట్లాడుతున్నంగా కౌశిక్ అడ్డుకొని నీది ఏ పార్టీ అంటూ నిలదీయడంతో గొడవ జరిగినట్లు తెలుస్తోంది… తామెప్పుడూ పెనుంటి మాసాలు లెక్కపెట్టలేదని ఒక పార్టీ గుర్తు మీద గెలిచి మరో పార్టీలోకి వెళ్లడం ఏంటని దమ్ముంటే తాను రాజీనామా చేసి ఇప్పుడు ఉన్న పార్టీ ద్వారా గెలుపొందాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఆయన అన్నారు..
జగిత్యాల నియోజకవర్గం లో ఉన్న సంజయ్ కి కెసిఆర్ పెట్టిన భిక్షా అని ఇప్పుడు అమ్ముడుపోయి స్టేజి మీద కూర్చుని తాను ఏదో విఐపిని అన్నట్టు బిహేవ్ చేస్తున్నారని అన్నారు. ఆయనకు నిజంగా పలుకుబడి ఉంటే నియోజకవర్గం లో తనకంటూ ఒక ప్రత్యేకత ఉంటే రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్ మీద మళ్లీ జగిత్యాల నుంచి పోటీ చేయాలి అని అన్నారు ఆయనకు కెసిఆర్ భిక్ష వేసారే తప్ప ఆయన సొంతంగా వచ్చింది కాదు అని మండిపడ్డారు డిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన పదిమందికి చెబుతున్నానని అన్నారు..KNR కలెక్టరేట్లో MLA సంజర్స్తో కౌశిక్ రెడ్డి ప్రవర్తించిన తీరును మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు, INC నేతలు ఖండించారు. అధికారిక కార్యక్రమంలో ఇలా ప్రవర్తించడం సరికాదని, ఇలాంటి ప్రవర్తనను తామెప్పుడూ చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.