Pawan Kalyan Fire on TTD incident Accused EO: కేవలం మీ జాగ్రత్త వల్ల ఆరు నిండు ప్రాణాలు కోల్పోయారని: డిప్యూటీ పవన్ కళ్యాణ్
కేవలం మీ జాగ్రత్త వల్ల ఆరు నిండు ప్రాణాలు కోల్పోయారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ లో తెలిపారు. ఈ ప్రెస్మీట్ల ఓ సంఘటన చోటుచేసుకుంది…
ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం తొక్కిసలట్టులో 6 మంది చనిపోయిన విషయం తెలిసిందే గాయపడిన వారిని ఈరోజు సాయంత్రం ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు బాధితులను పరామర్శించారు అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉండంగా అదే సమయానికి మాజీ సీఎం జగన్ స్విమ్స్ ఆస్పత్రికి బాధితుల పరామర్శ కోసం వచ్చారు. దీంతో ప్రెస్మీట్ వద్ద ఉన్న జనం గట్టిగా అరిచారు. ఏమైందంటూ పవన్ కళ్యాణ్ పక్కన ఉన్నవారిని అడిగ్గా జగన్ వచ్చినట్లు వారు చెప్పినట్లు తెలుస్తోంది. కాగా.. ఇటు ప్రెస్ మీట్ జరుగుతుండగా, జగన్ మరోవైపున ఆస్పత్రిలోపలికి వెళ్లి బాధితుల్ని పరామర్శించారు.
తిరుపతి తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పారు. అధికారులు, పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మనుషులు చనిపోతున్నా బాధ్యతగా వ్యవహరించరా అంటూ నిలదీశారు. ‘ప్రభుత్వానికి ఈవో, జేఈవో చెడ్డపేరు తీసుకువచ్చారు. మీరు బాధ్యతగా ఉండి ఉంటే ఈ ఘటన జరిగేది కాదు. జరిగిన తప్పునకు ప్రజలు క్షమించాలి’ అని కోరారు.తిరుపతి తొక్కిసలాట ఘటన కచ్చితంగా నిర్వహణ వైఫల్యమే అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. EO, AEO, పోలీసులు ఈ ఘటనకు బాధ్యత తీసుకోవాలన్నారు. క్రౌడ్, డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఖాకీలు ఫెయిల్ అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు తాను వచ్చిన సమయంలోనూ ఇది నిరూపితం అయిందన్నారు. నిన్నటి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి ఇళ్లకు TTD, పోలీసులు వెళ్లి క్షమాపణ చెప్పాలని సీఎంకు సూచిస్తానన్నారు.