Telangana New Schemes Releasing Sankranthi : సంక్రాంతి పండుగ పర్వదినాన రాష్ట్ర ప్రభుత్వం 4 కొత్త పథకాలు
సంక్రాంతి పండుగ పర్వదినాన రాష్ట్ర ప్రభుత్వం 4 కొత్త పథకాలను అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ మొదలు పెట్టింది..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ర్ట ప్రజలకు రైతులకు గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది..సంక్రాంతి పండుగ పర్వదినాన రాష్ట్ర ప్రభుత్వం 4 కొత్త పథకాలను అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ మొదలు పెట్టింది..అస్సలు అమలు చేయబోయే పథకాలు ఏంటి వాటి యొక్క మార్గదర్శకాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కనుక ఇంత వరకు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకూంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి..
1. రైతులకు రుణమాఫీ
తెలంగాణలో చాల మంది రైతులకు రుణమాఫీ జరగలేదు.దానికి ప్రభుత్వం టెక్నికల్ ఇష్యూస్ మరియు బ్యాంక్ పాస్ బుక్,పట్ట బుక్ పేర్లు సరితుగక పోవడం ,ఆధార్ కార్డు వివరాలు బ్యాంక్ వివరాలతో సరితుగాక పోవడంతో పాటు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వలన రైతులకు రుణమాఫీ అవ్వలేదు అని ప్రభుత్వం వెల్లడించింది.మాఫీ కానీ వారికోసం ప్రత్యేకంగా ఆప్ నీ ఏర్పాటు చేసి మాఫీ ఎందుకు కాలేదో వివరాలను ఆప్ లో నమోదు చేశారు.మాఫీ కానీ వారికి సంక్రాంతి తరువాత 2 లక్షలు మాఫీ చేస్తాం అన్నారు..
2.రైతూ భరోసా
అలాగే చాలా కాలం నుండి రైతులు రైతూ భరోసా కోసం ఎదురు చూస్తున్నారు వారికి కూడా వ్యవసాయ శాఖ మంత్రి ఈ సంక్రాంతి కానుకగా మొదటి విడతగా 7500 రూపాయలను నేరుగా రైతుల ఖాతాలోకి విడుదల చేస్తాం అని అన్నారు. శాటిలైట్ సర్వే ద్వారా కేవలం సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తాం అని ఆయన అసెంబ్లీలో వెల్లడించారు..రాళ్లు గుట్టలు రియల్ ఎస్టేట్ భూములకు మరియు సాగులో లేని భూములకు భరోసా డబ్బు ఇవ్వబోమని తెలిపారు.
3.భూమి లేని పేదవారికి 12000
పెద ప్రజలకు నేటి నుంచే 12000 ఆర్థిక సాయం మొదటి దశను 6000 రూపాయలను విడుదల చేస్తుంది భూమి లేని పేదవారికి ప్రభుత్వం ఇస్తానన్న 12k వేల రూపాయలను సంవత్సరానికి 2 దశల్లో అయితే ఇవ్వనుంది.
4.ఇందిరమ్మ ఇండ్లు
ఇల్లు లేని పేదలకు ఇళ్లను మంజూరు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను ప్రవేశ పెట్టిన విషయం తెల్సిందే మొత్తం 85 లక్షల వరకు దరఖాస్తులను స్వీకరించినట్టు రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.నియోజిక వర్గానికి 3500 ఇండ్ల చొప్పున ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు మొదటగా వికలంగులతో సహా భూమి ఉన్నవారికి మాత్రమే ఇండ్లు కట్టు కోవడానికి 5 లక్షల రూపాయలను మొదటి దశల్లో ఇవ్వనున్నారు తెలిపారు సంక్రాంతి పండుగ సందర్భంగా ఇళ్ల మంజూరు ప్రారంభిస్తాం అని అన్నారు.
5.రేషన్ కార్డు
అర్హులైన వారందరికీ రేషన్ కార్డు ఇచ్చేందుకు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగానే కొత్తగా పెళ్ళైన జంటలకు కూడా రేషన్ కార్డు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త రేషన్ కార్డుల్లో చిప్ అమర్చుతారు. దీనిలో లబ్ధిదారులకు సంబంధించిన పూర్తి విరాలు ఉంటాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ కోసం..”పౌర సరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కొత్త రేషన్ కార్డుల కోసం సంక్రాంతి నుంచి అప్లికేషన్లు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఇప్పటికే ప్రజా పాలనలో కొత్త రేషన్ కార్డు కోసం 10 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 32 లక్షల కుటుంబాలను లబ్దిదారులుగా అధికారులు గుర్తించారు.