Itersi to Jabalpur sitting under the wheels : బోగీ చక్రాల మధ్యలో పడుకొని ఏకంగా 290 కిలోమీటర్లు ప్రయాణించాడు.
రైలు చక్రాల కింద కూర్చొని ఇటర్సీ నుండి జబల్పూర్ కు చేరుకున్నాడు ఓ వ్యక్తి. ఎందుకు ఇలా చేసావు అంటే చార్జీలకు డబ్బులు లేక ఈ విధంగా చేస్తానని చెప్పారు దాని గురించి సమాచారం తెలుసుకుందాం..
ట్రైన్ ప్రయాణం అంటే దాదాపు స్లీపర్ ద్వారా చాలామంది ప్రయాణికులు టికెట్ లేకుండా ప్రయాణమైతే చేస్తూ ఉంటారు కొంతమంది అయితే టికెట్ తీసుకొని ప్రయాణం చేస్తూ ఉంటారు మరి కొంతమంది రిజర్వేషన్ చేసుకున్న తర్వాతే ప్రయాణాన్ని కొనసాగించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఓ వ్యక్తి తాను జబల్పూర్ చేరుకోవాల్సిన అవసరం ఉంది కానీ జబల్పూర్ కు చేరుకోవాలి అంటే టికెట్ బుక్ చేసుకోవడానికి లేదా సాధారణ టికెట్ తీసుకోవడానికి జేబులో డబ్బులు లేక రైలు భోగి చక్రాల కింద నిల్చొన జబల్పూర్ వరకు ప్రయాణం చేశారు ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
టికెట్ కొనేందుకు డబ్బులు లేకపోవడంతో ఓ ప్రయాణికుడు ప్రాణాలకు తెగించాడు.పుణే-దానాపూర్ ఎక్స్ప్రెస్లోలో ఓ వ్యక్తి ఇటార్సి – MPలోని జబల్పూర్కు చేరుకున్నారు.కంపార్ట్మెంట్లో కాకుండా బోగీ చక్రాల మధ్యలో పడుకొని ఏకంగా 290 కిలోమీటర్లు ప్రయాణించాడు. రైల్వే క్యారేజ్ ఉద్యోగులు అతడిని గుర్తించి బయటకు తీసి RPF సిబ్బందికి అప్పగించారు. అక్కడ అంతసేపు ఎలా ఉన్నాడ్రా బాబు? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఘటనపై రైల్వే పోలీస్ అధికారులు ఆ వ్యక్తిపై fir నమోదు చేశారు. ఈ వింత ఘటన పై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ అయితే చేస్తున్నారు చాలామంది అక్కడ అతసేపు ఎలా ఉన్నావని కామెంట్ చేశారు.