37th Hyderabad National Book Fair 2024: ఎన్టీఆర్ స్టేడియంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ

Photo of author

By Admin

37th Hyderabad National Book Fair 2024: ఎన్టీఆర్ స్టేడియంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ

ఎన్టీఆర్ స్టేడియంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ ఏర్పాటు చేసిన 37 వ పుస్తక ప్రదర్శనను ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు.

Book Fair
Book Fair

ఉద్యమాల పట్ల చరిత్రకారులు వాస్తవాలను రాయకపోతే అసలైన పోరాట యోధులు, ఉద్యమాల్లో అసువులు బాసిన అమరుల గురించి భవిష్యత్తు తరాలకు అసంపూర్తి సమాచారమే అందుబాటులో ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. అందువల్ల వాస్తవాలను సమాజం ముందు ఆవిష్కరించాలంటే కవులు, కళాకారులు తమ కలాలకు పదును పెట్టాలని, తమ గళాలను విప్పాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.ఎన్టీఆర్ స్టేడియంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ ఏర్పాటు చేసిన 37 వ పుస్తక ప్రదర్శనను ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. తర్వాత బోయి విజయ భారతి గారి వేదికగా ఏర్పాటు చేసిన సదస్సులో ప్రసంగించారు.

Book Fair Revanth Reddy
Book Fair Revanth Reddy

చరిత్ర ఎప్పుడూ గెలిచిన వాళ్లు రాసుకునేదే చరిత్రగా ఆవిష్కృతమవుతోందని, పోరాటాల్లో అసులు బాసిన వాళ్లు, అమరులైన వారి గురించి చరిత్రలో కొంత నిర్లక్ష్యం గురికావడం, కొంత సమాచార లోపం ఉంటుంది.సాయుధ రైతాంగ పోరాటం, తొలి దశ తెలంగాణ ఉద్యమైనా, మలి దశ తెలంగాణ ఉద్యమమైనా.. ఉద్యమాల్లో సమిధలైన, అమరులైన వారికంటే, రాజకీయంగా ప్రయోజనం పొందిన వారి గురించే ఎక్కువ చర్చ జరుగుతుంది.గత పదేళ్లుగా మన కళ్ల ముందున్న చరిత్రలో వాస్తవాలు, అవాస్తవాలు గమనించి కవులు, కళాకారులు తమ కలాలను పదును పెట్టాలి.

Telangana Book Fair
Telangana Book Fair

సమాజం అధునాతన యుగం వైపు, సాంకేతిక పరిజ్ఞానం వైపు వెళుతున్న సందర్భంలో డిజిటల్, సోషల్ మీడియాల వంటి మాధ్యమాల వల్ల ఏది వాస్తవమో, ఏది ఆవాస్తవమో గ్రహించే పరిస్థితులు లేకుండా పోతున్నాయి. యువతను పుస్తక పఠనంవైపు మళ్లిస్తే వాస్తవాలు తెలుసుకునే వీలుంటుంది.1985 లో సిటీ సెంట్రల్ లైబ్రరీలో చిన్నగా ప్రారంభించిన బుక్ ఫెయిర్ ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో చేపట్టడం, అందులోనూ ఎంతోమంది మేధావులు పాల్గొని వచ్చే తరానికి ఒక స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.బుక్ ఫెయిర్ నిర్వహకులు ప్రస్తావించిన విషయాలపై ప్రొ. కోదండరాం గారు నివేదిక రూపంలో అందజేస్తే వాటిని పరిశీలించి సామాజిక బాధ్యతగా నిర్ణయం తీసుకుంటాం.కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, పొన్నం ప్రభాకర్ గారు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, బుక్ ఫెయిర్ అధ్యక్షుడు కవి యాకూబ్ గారు, ఎమ్మెల్సీ కోదండరాం గారు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, ప్రొ. రమా మెల్కోటే గారు, సీనియర్ పాత్రికేయులు రామచంద్రమూర్తి గారితో పాటు ఎంతో మంది ప్రముఖ కవులు, రచయితలు, కళాకారులు హాజరయ్యారు.

Leave a Comment