Amit Shah Comments on Ambedkar in Parliament: అంబెడ్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలు దేశం మొత్తం దుమారం
అంబేడ్కర్పై అమిత్ షా వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. నిన్న ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ ‘అంబేడ్కర్.. అంబేడ్కర్.. అంబేడ్కర్ అనడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది.
అంబేడ్కర్పై కేంద్రమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ప్రతిపక్షాలు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం దగ్గర ఆందోళనకు దిగాయి. రాహుల్ గాంధీతో పాటు కేజీవాల్, తదితర నేతలు అందులో పాల్గొన్నారు. మరోవైపు బిహార్ రాజధాని పట్నాలో ఆర్జేడీ నేతలు అమిత్ షా దిష్టిబొమ్మను చెప్పులతో కొడుతూ దహనం చేశారు.
అంబేడ్కర్పై వ్యాఖ్యల వివాదం నేపథ్యంలో అమిత్ షా కాంగ్రెస్పై ఎదురుదాడికి దిగారు. ‘రాజ్యాంగాన్ని గౌరవించని పార్టీ కాంగ్రెస్. ఆ పార్టీ మహిళలను, వీర జవాన్లను అవమానించింది. SC,STలకు వ్యతిరేకం’ అని మండిపడ్డారు. అంబేడ్కర్పై తన వ్యాఖ్యలను వక్రీకరించారని షా ఆరోపించారు. గతంలోనూ రిజర్వేషన్లపై తన కామెంట్స్ను కాంగ్రెస్ డీప్ ఫేక్ చేసిందని గుర్తు చేశారు. అంబేడ్కర్ను BJP ఎప్పుడూ అగౌరవపరచదని స్పష్టం చేశారు.అంబేడ్కర్పై అమిత్ షా వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. నిన్న ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ ‘అంబేడ్కర్.. అంబేడ్కర్.. అంబేడ్కర్ అనడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. అన్నిసార్లు భగవంతుడిని ప్రార్ధిస్తే మీకు 7 జన్మల స్వర్గప్రాప్తి కలుగుతుంది’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలే విపక్షాల ఆగ్రహానికి కారణమయ్యాయి. BJPకి అంబేడ్కర్ ఇష్టంలేదని, ఆయన నిర్మించిన రాజ్యాంగాన్ని కూడా మార్చాలని చూస్తోందని మండిపడుతున్నాయి
అంబేడ్కర్పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్ వద్ద INC నిరసనకు దిగింది. షా వెంటనే క్షమాపణలు చెప్పి, రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ‘ఈమధ్య అంబేడ్కర్, అంబేడ్కర్ అనడం ఫ్యాషన్గా మారింది. వాళ్లు అన్నిసార్లు అలా అనడం కంటే దేవుడి పేరును స్మరిస్తే స్వర్గంలో స్థానం దక్కుతుంది’ అని షా వ్యాఖ్యానించడంతో దుమారం రేగింది. అయితే అంబేడ్కర్కు భారతరత్న ఇవ్వకుండా అవమానించింది కాంగ్రెస్సేనని BJP మండిపడింది.
అంబేడ్కర్పై అమిత్ షా వ్యాఖ్యలను తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ దళపతి ఖండించారు. ‘కొందరికి అంబేడ్కర్ పేరంటే నచ్చకపోవచ్చు. కానీ ప్రస్తుతం స్వాతంత్ర్య స్వేచ్ఛావాయువులు పీలుస్తున్న ప్రతి భారతీయుడు ఆరాధించే వ్యక్తి ఆయన. అంబేడ్కర్ పేరు పలకడానికి గుండె, పెదవులు కూడా ఎంతో సంతోషిస్తాయి. ఆయనను అగౌరవపరచడాన్ని అంగీకరించం. మా పార్టీ తరఫున కేంద్ర హోంమంత్రి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం’ అని ట్వీట్ చేశారు