Bhatti Vikramarkha Vs Harish Rao for Loans అప్పులు చేసి నీతులు చెపుతున్నారు
తమ ప్రభుత్వం రూ.52 వేల కోట్ల అప్పు తీసుకుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అదే సమయంలో రూ.66 వేల కోట్ల అప్పులను తిరిగి చెల్లించినట్లు తెలిపారు.
బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర అప్పులపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని అసెంబ్లీలో హరీశ్ రావు విమర్శలు చేశారు. దీనిపై చర్చ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే తాము అధికారంలోకి రాగానే అన్ని అంశాలపై శ్వేతపత్రాలు బయటపెట్టినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుర్తు చేశారు. అప్పులపై చర్చకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. దీంతో సవాల్ను తాను స్వీకరిస్తున్నట్లు హరీశ్ రావు చెప్పారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పిన ప్రకారం ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1,27,208 కోట్ల అప్పులు చేసిందని BRS ఎమ్మెల్యే హరీశ్రవు అసెంబ్లీలో అన్నారు. BAC సమావేశంలో బిల్లులపై చర్చ జరగక ముందే అసెంబ్లీలో ప్రవేశపెట్టడాన్ని ఆయన ఖండించారు. అసెంబ్లీ రూల్ బుక్ ప్రకారంగా వ్యవహరించాలని గుర్తుచేశారు. నిన్న జరిగిన BAC సమావేశంలో హరీశ్రవు ఉన్న సంగతి తెలిసిందే.అప్పులు అడుగుతున్నాం అని భట్టి భారీ స్పీచ్ ఇచ్చారు నేను మాత్రం అప్పులనే అడుగుత అంటూ వివరణ కోరారు ఎంఎల్ఏ హరీశ్ రావు.
తమ ప్రభుత్వం రూ.52 వేల కోట్ల అప్పు తీసుకుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అదే సమయంలో రూ.66 వేల కోట్ల అప్పులను తిరిగి చెల్లించినట్లు తెలిపారు. ఖర్చు రూపాయితో సహా లెక్కగట్టి చెబుతామని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన బీఆర్ఎస్ నేతలు నీతులు చెప్తున్నారని దుయ్య బట్టారు. మరోవైపు కాంగ్రెస్ ఏడాది పాలనలోనే రూ.1.27 లక్షల కోట్ల అప్పు చేసిందని హరీశ్ రావు ఆరోపించారు.