LIC Bheema Sakha Yojana Scheme Details 2024 : మహిళా లకు పీఎం కొత్త పథకం 2.64 వేలు ఇవ్వనుంది
కేంద్ర ప్రభుత్వం మహిళలను ప్రక్షాధికారులుగా మార్చడం కోసం కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చింది ఈ పథకం ద్వారా మూడు సంవత్సరాలలో మహిళలు 264 వేల వరకు అయితే సంపాదించవచ్చు.
Over view
ప్రభుత్వం మహిళల సాధికారత కోసం ఎప్పటికప్పుడు కొత్త పథకాలను అయితే తీసుకువస్తోంది. గతంలోనూ ప్రధానమంత్రి యోజన ద్వారా కొంత మొత్తంలో అయితే మహిళలకు ఆర్థిక సహాయం చేసింది ఇప్పుడు మరికొంతమందికి ఆర్థిక సహాయం చేయడం కోసం వారిని ఉద్యోగినిగా మార్చడం కోసం కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసి బీమాసకి యోజనలను తీసుకురావడం జరిగింది ఈ పథకం ద్వారా దేశంలోని 10వ తరగతి చదువుకున్న మహిళల అందరిని ఉద్యోగులుగా మార్చడం కోసం కృషి చేస్తున్నట్లు పియం తెలిపారు. దేశంలో చాలామంది మహిళలు హౌస్ వైఫ్ గా, చిన్న వ్యాపారస్తులుగా డైలీ లేబర్లుగా అయితే పనిచేస్తూ ఉన్నారు. వారిలో కొంతమంది చదువుకున్న వారు కూడా ఉన్నారు.
వారికి సహాయం చేయడం కోసం రా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చినట్లు పియం నరేంద్ర మోడీ తెలిపారు ఈ పథకాన్ని గౌరవనీయులు మోడీ గారు డిసెంబర్ 9న ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ద్వారా ప్రతి చదువుకున్న మహిళ మూడు సంవత్సరాలకు గాను రెండు లక్షల 64 వేల వరకు సంపాదన అయితే సమకూర్చుకోవచ్చు. చదువుకున్న అనగానే ఏదో పిహెచ్డీలు ఎంఏ లు పిఏలు చేసిన వారు మాత్రమే ఈ పథకానికి అప్లై చేసుకోవాలని రూల్ అయితే లేదు పదవ తరగతి పాసైన ప్రతి ఒక్క మహిళ ఈ పథకానికి అప్లై అయితే చేసుకోవచ్చు… పథకానికి సంబంధించిన అర్హతలు ఒకసారి చూసుకుందాం…
అర్హతలు
- ఈ పథకానికి అప్లై చేసుకునే అభ్యర్థి కచ్చితంగా 10వ తరగతి పాసై ఉండాలి.
- అప్లై చేసుకోవాలి అనుకునే వారు కచ్చితంగా మహిళ అయి ఉండాలి..
- మహిళ వయసు 18 నుంచి 70 సంవత్సరాల మధ్య ఉండాలి.
- ఆమె పదవ తరగతి లేదా అంతకన్నా ఎక్కువ చదువు చదివినా కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు…
ఎంపిక విధానం
- ఈ పథకానికి అప్లై చేసుకున్న అభ్యర్థులను మొదట ఎల్ఐసి కి సంబంధించిన వారు కొద్ది రోజులు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
- ఆ ట్రైనింగ్ అనేది పూర్తయిన తర్వాత ఐఆర్డిఏఐ ద్వారా ఒక పరీక్షను అయితే నిర్వహించడం జరుగుతుంది.
- ఆ పరీక్షలో ఉత్తీర్ణులు అయితే అంటే పాస్ అయితే వారికి పెర్మనెంట్గా ఉద్యోగం అనేది కల్పిస్తారు.
- పార్ట్ టైం గా గాని లేదా ఫుల్ టైం గా గాని ఈ సంస్థలో అయితే మహిళలు పని చేసుకోవచ్చు..
ట్రైనింగ్ ఎన్ని రోజులు
మహిళలు ఎల్ఐసి వారు ట్రైనింగ్ అనేది మూడు సంవత్సరాల వరకు ఇవ్వడం జరుగుతుంది.
- ఈ ట్రైనింగ్లో మొదటి సంవత్సరం 7000 రూపాయలు స్టైఫండ్ గా అందిస్తారు
- అదేవిధంగా రెండవ సంవత్సరంలో 6000
- మూడవ సంవత్సరంలో 5000 రూపాయలను అయితే నెలచొప్పున ఇవ్వనున్నారు.
దానితో పాటు పాలసీలు కట్టించినందుకు గాను కమిషన్ రూపంలో కూడా కొంత డబ్బును అందించనున్నారు…
కమిషన్ ఏలా ఉంటుంది
ఎల్ఐసి సమస్త ట్రైనింగ్ పీరియడ్లో ప్రతి ఒక్క మహిళకి 7000 రూపాయల చొప్పున నెలకు ఇస్తుంది ఆ టైంలోనే పాలసీలు సేల్ చేసినందుకు గాను 24 పాలసీలకు 48 వేల వరకు అయితే కమిషన్ రూపంలో మహిళకు నేరుగా ఖాతాలోకి జమ చేస్తారు…
ఉద్యోగా విధానాలు
ఈ సంస్థ మూడు సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఒక పరీక్షను అయితే నిర్వహిస్తుంది ఆ పరీక్షలో గనుక అభ్యర్థి పాస్ అయితే తమ యొక్క చదువును బట్టి హోదా అనేది కల్పిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ అభ్యర్థి పదవ తరగతి మాత్రమే పాస్ అయి ఉంటే ఎల్ఐసి ఏజెంట్ పదవిని కట్టబెడుతుంది ఒకవేళ అభ్యర్థి డిగ్రీ గనుక పోటీ చేసినట్టు అయితే వారికి ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్గా అవకాశం ఇవ్వడం జరుగుతుంది.
ఉద్యోగం ఏలా ఉంటుంది
ఈ పథకం ద్వారా ఉత్తీర్ణులు ఆయన వారు ఫుల్ టైం గాని లేదంటే పార్ట్ టైం గా ఈ ఉద్యోగాన్ని అయితే చేసుకోవచ్చు…
Apply Now
FAQ