Manchu Family Controversy Manoj Vs Mohan Babu: వాడి వలనే మనోజ్ కి ఇన్ని కష్టాలు : మోహన్ బాబు 2024

Photo of author

By Admin

Manchu Family Controversy Manoj Vs Mohan Babu: వాడి వలనే మనోజ్ కి ఇన్ని కష్టాలు : మోహన్ బాబు

మంచు ఫ్యామిలీలో గత రెండు రోజులుగా అల్లర్లు అయితే జరుగుతున్నాయి ఈ గొడవలు అన్ని పద్యంలో మంచు మనోజ్ చాలా ఎక్కువగా గాయపడినట్టు అయితే తెలుస్తోంది. అసలు మంచు ఫ్యామిలీలో ఈ గొడవలు ఎందుకు అవుతున్నాయి. దానికి గల కారణం ఏంటి ? ఆస్తి గొడవల లేదా మరి ఏదైనా గొడవల ?

Overview

Mohan బాబు యూనివర్సిటీ లో రోజు రోజుకు ఫిజ్ భారం పెరిగిప్తోందని దీని వలన పిల్లలు మరియు వారి పేరెంట్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు స్ట్రైక్ చేయడానికి ముందుకు రాగ వారికి మంచు మనోజ్ అండగా ఉన్నయ్ చెప్పడంతో మంచు ఫ్యామిలిలో ఈ గొడవలు తీవ్రం అయినట్టు తెలుస్తోంది.గతంలో నుండే మంచు మనోజ్ మరియు మంచు విష్ణు కి మధ్య గొడవలు ఉండేవి మనోజ్ వాళ్ళ ఫ్యామిలీకి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారని మంచు విష్ణు మంచు మోనోజ్ పై దాడి చేసిన వీడియోని గతంలో మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు ఆ వీడియో రిలీస్ చేసి కొన్ని గంటల తరువాత మోహన్ బాబు స్పందించడంతో ఆ వీడియోని మంచు మనోజ్ డిలేట్ చేసి దానిని మంచు వారి రియాలిటీ షో త్వరలో ప్రారంభం కానున్నట్టు కవర్ చేశారు మల్లి గత రెండు రోజుల నుండి ఈ గొడవలు తార స్థాయికి చేరుకున్నాయి.. ఇప్పుడు కొట్టుకునే వారికి వచ్చాయి అంటే ఈ గొడవలు ఎంత ముదిరాయి మనం ఎక్ష్పెక్త్ చేయొచ్చు.

మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల దోపిడీపై AP ప్రభుత్వం విచారణ చేయించాలని AISF జాతీయ కార్య దర్శి శివారెడ్డి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ‘MBUలో ఫీజుల దోపిడీపై మంచు మనోజ్ స్టేట్మెంట్ను సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాలి. ప్రతి విద్యార్థి దగ్గర ఏటా ₹20,000 అధికంగా వసూలు చేస్తున్నారు. ప్రశ్నించిన పేరెంట్స్ను మోహన్ బాబు బౌన్సర్లతో కొట్టిస్తున్నారు. స్టూడెంట్స్ను ఫెయిల్ చేయిస్తున్నారు’ అని ఆరోపించారు.

మనోజ్ పరిస్థితి ఏంటి

డిసెంబర్ 8 న మంచు మనోజ్ ని కిరణ్ మరియు అతని అనుచరులు కొట్టి సీసీటీవీ ఫ్యూటజీని ద్వాంసం చేశారు అని మంచు మనోజ్ పేర్కొన్నాడు.రాత్రి సమయంలో తనపై దాడి జరగడంతో ౧౦౦ కి కాల్ చేసి చెప్పను అన్నారు అక్కడికి చేరుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.ఐతే దాని పై మనోజ్ ఎలాంటి కంప్లైంట్ ఇవ్వక పోవడం పోలీసులు ఇదంతా ఫ్యామిలీ గొడవలు అని అన్నారు.మరుసటి రోజు మోహన్ బాబు ట్విట్టర్ వేదికగా మా ఫ్యామిలిలో ఎలాంటి గొడవలు జరగలేదని ఇదంతా మీడియా కావాలనే చేస్తోంది అని అన్నారు.కానీ డిసెంబర్ 09న బంజారా హిల్స్ లోని tx హాస్పటల్ లో ట్రాట్మెంట్ కి వచ్చిన మంచు మనోజ్ కు అక్కడికి డాక్టర్స్ మెడికో నిర్వహించగా తీవ్ర గాయాలు అయినట్టు మెడికల్ రిపోర్ట్ ఇచ్చారు..

అదే రోజున పహాడీ షరీఫ్ పీఎస్కు వచ్చిన హీరో మంచు మనోజ్ తనపై జరిగిన దాడిపై ఫిర్యాదు చేశారని సీఐ తెలిపారు. 10 మంది ఆగంతకులు తనపై దాడికి పాల్పడ్డారని, ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు. విజయ్, కిరణ్ సీసీ ఫుటేజీ తీసుకెళ్లారని చెప్పినట్లు వెల్లడించారు. ఫిర్యాదు మేరకు మనోజ్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని సీఐ వివరించారు. ఫిర్యాదులో కుటుంబ సభ్యుల పేర్లు లేవని ఆయన స్పష్టం చేశారు.

Manchu Family Controversy
Manchu Family Controversy

తాను ఆస్తులు, డబ్బు కోసం పోరాటం చేయడం లేదని సినీ నటుడు మంచు మనోజ్ అన్నారు. తాను ఆత్మగౌరవం కోసమే పోరాడుతున్నానని చెప్పారు. ‘నాకు న్యాయం జరగడం లేదు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. నాకు న్యాయం జరిగేవరకూ అందరినీ కలుస్తా. నా బిడ్డలు ఇంట్లో ఉండగా దాడికి పాల్పడ్డారు. నా భార్యాపిల్లలకు రక్షణ కరవైంది’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.హైదరాబాద్లోని జల్పల్లిలోని మోహన్ బాబు ఇంట్లో మంచు కుటుంబ సభ్యుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. కుటుంబంలో వివాదం నెలకొన్న నేపథ్యంలో సన్నిహితుల సమక్షంలో మోహన్ బాబు, విష్ణు, మనోజ్ చర్చించుకుంటున్నారు. వివాదం నేపథ్యంలో విష్ణు దుబాయ్ నుంచి ఇవాళ హైదరాబాద్కు వచ్చిన సంగతి తెలిసిందే.

Manchu Mohan Babu

తనకు ముప్పు పొంచి ఉందని, రక్షణ కల్పించాలని మోహన్బాబు వాట్సాప్లో ఇచ్చిన ఫిర్యాదుపై కొడుకు మనోజ్, కోడలు మౌనికపై FIR నమోదైంది. తనపై దాడి చేశారని, ప్రాణహాని ఉందంటూ మంచు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదుపై మోహన్ బాబుకు చెందిన 10 మంది అనుచరులపై పహాడిషరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు.

నివాసంలో ఉద్రిక్తత

తన నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితుల నడుమ మంచు మోహన్ బాబు భావోద్వేగంగా మాట్లాడారు. అందరికంటే ఎక్కువగా మనోజ్ను గారాబంగా పెంచానని చెప్పారు. ఆయన ఏది అడిగినా ఇచ్చానన్నారు. జల్పల్లి ఇల్లు తన కష్టార్జితమని, మనోజ్కు సంబంధం లేదని తెలిపారు. మనోజ్ మద్యానికి బానిసగా మారారని అన్నారు. మద్యం మత్తులో ఇంటి పనివారిపై దాడులు చేస్తున్నారన్నారు. శంషాబాద్ జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. ఆయన ఇంటికి మనోజ్ దంపతులు రాగా, సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. మనోజ్ వాహనాన్ని గేటు వద్దే ఆపేశారు. దీంతో కారు నుంచి బయటకు దిగి గేట్లు తోసుకుంటూ లోపలికి వెళ్లిన మంచు మనోజ్పై మోహన్ బాబు, ఆయన బౌన్సర్లు దాడి చేశారు. దీంతో చిరిగిన చొక్కాతో మనోజ్ బయటకు వచ్చారు.

అనంతరం మీడియా ప్రతినిధులతో మోహన్ బాబు బూతులు తిడుతూ దాడికి దిగారు. దీంతో ఏం జరుగుతుందనే విషయాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన మీడియాపై మంచు మోహన్ బాబు దౌర్జన్యానికి పాల్పడ్డారు. వారి చేతుల్లోని మైకులను లాక్కొని ఆవేశంతో నేలకేసి కొట్టారు. గేటు లోపలికి వచ్చేందుకు ప్రయత్నించిన వారిపై దాడి చేశారు. అక్కడే ఉన్న పోలీసులు ఆయనను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. మీడియా ప్రతినిధులను బౌన్సర్లు బయటకు పంపించారు.మీడియాపై మంచు మోహన్ బాబు దాడి చేయగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు చర్యలకు దిగారు. వెంటనే ఆయన నివాసాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. మరోవైపు మోహన్ బాబు, విష్ణు గన్స్ సీజ్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

Manchu Family Controversy Manoj Vs Mohan Babu

మంచు మనోజ్ తీరుతో వాళ్ల అమ్మ ఆసుపత్రిలో చేరిందని మోహన్ బాబు అన్నారు. అతని ప్రవర్తనతో తన మనసు ఆవేదనతో కుంగిపోయిందని చెప్పారు. మనోజ్ తనను కొట్టలేదని, ఇద్దరి మధ్య ఘర్షణ జరిగిందని పేర్కొన్నారు. భార్య మాటలు విని తన కుమారుడు తాగుడుకు అలవాటయ్యాడన్నారు. ‘మనోజ్కు జన్మనివ్వడమే నేను చేసిన పాపమా?’ అని మోహన్ బాబు అన్నారు. ఆస్తులు ఎలా పంచాలి అన్నది తన ఇష్టమని స్పష్టం చేశారు.50 ఏళ్ల సినీ ప్రస్థానం, 500కు పైగా సినిమాలు, అద్భుతమైన MBU యూనివర్సిటీ, MP, పద్మశ్రీ, ఎన్నో అవార్డులు, డైలాగ్ కింగ్ ఇవన్నీ మోహన్ బాబు పేరు చెప్తే ఇప్పటివరకు గుర్తొచ్చేవి. కానీ కుమారుడు మంచు మనోజ్తో గొడవ అంశంతో మంచు ఫ్యామిలీ పరువు మంచులా కరిగిపోయింది. గుట్టుచప్పుడు కాకుండా 4 గోడల మధ్య పూర్తికావాల్సిన ఆస్తి వ్యవహారం వివాదాలతో బిగ్బాగ్ హౌస్లా బయటకొచ్చింది. ఈ ఘటన మంచు ఫ్యామిలీకి మచ్చగా మిగిలింది.

Leave a Comment