Bhatti Vikramarkha Shocking comments on BRS: 10 ఏళ్ళు పాలించిన ప్రభుత్వం హైదరాబాద్ ను అభివృద్ధి చేయకపోగా అప్పులను మిగిల్చింది : మంత్రి

Photo of author

By Admin

Bhatti Vikramarkha Shocking comments on BRS: 10 ఏళ్ళు పాలించిన ప్రభుత్వం హైదరాబాద్ ను అభివృద్ధి చేయకపోగా అప్పులను మిగిల్చింది : మంత్రి

తెలంగాణ రాష్ట్రానికి భరసా ఏమి డెవలప్ చేయకపోగా… రాష్ట్రనికి అప్పులు మిగిల్చి పోయారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ రాష్ట్రానికి గత brs ప్రభుత్వం ఏమాత్రం అభివృద్ధి దిశగా నడపక పొగ రాష్ట్రానికి మొత్తం అప్పుకు మిగిల్చింది అని ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్కుహా అన్నారు.ప్రాణాలు అర్పించి తెలంగాణ తెచ్చుకున్నది మనం ,దీక్షలు రాస్తా రోకోలు చేసింది మనం కోట్లాది తెచ్చుకున్న తెలంగాణకు గత ప్రభుత్వం అభివృద్ధి చేయలేదనీ అన్నారు.ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి గత brs ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి పథంలో నడిపించలేదని ఆయన అన్నారు.మీరు గమనించి మెదులుకోవాలి అని ప్రజ విజయోత్సవ సభలో ఉప ముఖ్యమంత్రి అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే చేసిన అప్పులకు వడ్డీలు కడుతూ పుంజుకుంటుందని ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉందని అన్నారు.అప్పులు తెచ్చి కొప్పులు పెట్టారు..ఆ అప్పులను కడుతూ పథకాలను అమలు చేస్తుంది..అని సీఎం అన్నారు

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో హైదరాబాద్ నగరాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ట్యాంక్బండ్ వద్ద నిర్వహించిన ప్రజా పాలన విజయోత్సవ సభలో పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వాలు చేసిన అభివృద్ధిని బీఆర్ఎస్ చేసినట్లు చెప్పుకొచ్చిందన్నారు. పాత అభివృద్ధి పనులను తాము చేసుకున్నట్లు రంగులు అద్ధారని, అంతే తప్ప కొత్తగా చేసిందేమీ లేదని భట్టి ఎద్దేవా చేశారు.ప్రజా విజయోత్సవ ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి మరియు బట్టి విక్రమార్కుహ రూ. 5,827 కోట్లతో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభించారు.నగరంలో వరదనీరు నిలవకుండా వర్షపు నీటి సంరక్షణ, వరద నీటిని నియంత్రించే పనులకు రూ. 17 కోట్ల అంచనాలతో చేపట్టే పనుల ప్రారంభించారు.రూ. 669 కోట్ల అంచనాలతో హైదరాబాద్ జల మండలి (HMWSSB) అధ్వర్యంలో నిర్మించిన మురుగు నీటిని శుద్ధి చేసే ప్లాంట్లు (సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు) ప్రారంభించారు.

తాగునీటి సరఫరాకు అవుటర్ రింగ్ రోడ్డు ORR చుట్టూ వివిధ ప్రాంతాల్లో రూ. 45 కోట్లతో చేపట్టిన 19 రిజర్వాయర్లను ప్రారంభించారు. హైదరాబాద్ రోడ్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (HRDCL) అధ్వర్యంలో గ్రేటర్ సిటీలో రూ. 1500 కోట్లతో రోడ్లను అభివృద్ధి చేసే ప్యాకేజీతో పాటు గతంలో పెండింగ్‌లో ఉన్న పనులకు శంకుస్థాపన చేశారు.అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుసంధానంతో కొత్త ఆన్‌లైన్‌లో బిల్డింగ్ అప్రూవల్, లేఅవుట్ అప్రూవల్ సాఫ్ట్‌వేర్‌ను సీఎంగారు లాంఛనంగా ప్రారంభించారు. 2025 ఫిబ్రవరి నుంచి ఈ విధానం అమలులోకి రానుంది.

Leave a Comment