District-wide public school bandh under leadership of PDSU-AISF-SFI: జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు బంద్ విజయవంతం
PDSU-AISF-SFI వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు బంద్ విజయవంతం
రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే విద్యారంగంపై సమీక్ష జరపాలి.
ఫుడ్ పాయిజన్ ఘటనలకు భాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
మధ్యాహ్న భోజనానికి అధిక నిధులు ఇచ్చి, పెండింగ్ బిల్లులను విడుదల చేయాలి.
గురుకులాలు, కెజిబివిలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, మెను అమలుకు చర్యలు తీసుకోవాలి.
విద్యాశాఖ మంత్రిని నియమించాలి.
PDSU-AISF-SFI వామపక్ష విద్యార్థి సంఘాల జిల్లా కమిటీల ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల బంద్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
District-wide public school bandh under leadership of PDSU-AISF-SFI ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహాద్రి, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు గోపగాని రవి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భానోత్ వినోద్ కుమార్, మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల విషయంలో మాత్రం అధికారులు నిర్లక్ష్యం వీడడం లేదు. ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టల్స్, గురుకులాల్లో ఎక్కడ చూసినా నిర్లక్ష్యం తాండవిస్తున్నది అని అన్నారు. హాస్టళ్లలో అనుమానస్పద మరణాలు, బలవన్మరణాలు, అనారోగ్యం, కలుషిత ఆహారం తిని చనిపోవడం వంటి ఘటనలు రాష్ట్ర ప్రభుత్వo ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల పట్ల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. హస్టళ్లలో జరగుతున్న మృత్యఘోషను నివారించాల్సిన ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా విచారణ కమిటీలు ఏర్పాటు చేయడం, వార్డెన్‌ను, ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయడంతో సరిపెడుతున్నారు అని అన్నారు. సమస్యకు మూల కారణాలు కనుక్కొని శాశ్వత పరిష్కారం చూపడంపై దృష్టి సారించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో అదే నిర్లక్ష్యం మళ్లీ మళ్లీ కొనసాగుతున్నది. గడచిన ఏడాది కాలంగా రాష్ట్రవ్యాప్తంగా 38 గురుకులాల్లో కలుషితాహార ఘటనల్లో 886 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా నలుగురు చనిపోయారు. ఈ నెల 3న వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తినడంతో పలువురు విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. వీరిలో విద్యార్థిని శైలజ విద్యార్థి మృతి చెందింది రేవంత్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్యం అని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కారణాలతో 886 మంది విద్యార్థులు అస్వస్థకు గురికాగా వారిలో 48 మంది మృత్యవాత పడ్డారు. వారిలో 13 మంది అనారోగ్యంతో చనిపోయారు అని అన్నారు. 23 మంది మానసిక ఒత్తిడితో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 8 మంది అనుమానస్పదంగా మృతి చెందగా, నలుగురు కేవలం ఫుడ్ పాయిజన్‌తో మరణించారు అని అన్నారు. రాష్ట్రంలోని విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించాలి అని డిమాండ్ చేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలని దాంతోపాటు హాస్పటల్లో చికిత్స పొందుతున్న విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సాధించాలని డిమాండ్ చేయడం జరిగింది.
లేనియెడల వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులు అందరితో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు పోరాటాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు డివిజన్ ప్రధాన కార్యదర్శి పిడమర్తి భరత్, ఏఐఎస్ఎఫ్ నాయకులు, నాగరాజు,నాగయ్య, పి.డి.ఎస్.యు నాయకులు అభిరామ్, చింటూ, నాని, మధు,అజయ్ తదితరులు పాల్గొన్నారు