Telangana Crop loan waiver latest news: ఈ నెల 30న నాలుగు లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామన్న మంత్రి 2024
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఈనెల 30వ తారీకు నుంచి మిగిలిన రైతు రుణమాఫీని మాఫీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలపడం జరిగింది.
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ హామీలైన రెండు లక్షల రుణమాఫీని ఇప్పటివరకు మూడు దశలో అయితే మాఫీ చేసింది అప్పుడు మూడు దశలో మాఫీ కానీ రైతులకు రుణాలను ఈ నెల 30 వ తారీఖున పూర్తి దశలో మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ తో సహా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలపడం జరిగింది.పలు కారణాలతో రుణమాఫీ నిలిచిన 3 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఈ నెల 30న డబ్బులు జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. రైతు సంక్షేమంపై CM రేవంత్ చిత్తశుద్ధితో ఉన్నారని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి రైతు బీమాను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.
ధాన్యం దిగుబడిలో తెలంగాణ తొలి స్థానంలో ఉందన్నారు. మనం పండించిన వడ్లు మలేషియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు ఎగుమతి అవుతున్నాయని పేర్కొన్నారు. ఇంకా తెలంగాణలో రైతు రుణమాఫీకి నాలుగు లక్షల మందికి అర్హత ఉందని గుర్తించింది ప్రభుత్వం. వీరికి ఈ నెల 30న రైతు పండుగ కార్యక్రమంలో చెల్లించేలా నిర్ణయం ప్రకటించింది. ఇదే సమయంలో సన్నరకాల ధాన్యంకు సంబంధించి రైతులకు ఇస్తామన్న రూ.500 బోన్సను కూడా అదే రోజున బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి తుమ్మల ప్రకటించారు. ఇప్పటికే చాలామంది రైతులకు 500 రూపాయల బోనస్ ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తుమ్మల వివరించారు. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని వెల్లడించారు.
దీనికి సంబం ధించిన ప్రీమియం సొమ్ము ప్రభుత్వమే చెల్లిస్తుందని పేర్కొన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తి పోతల పథకాన్ని త్వరగా పూర్తి చేయాలన్న సంకల్పంతో సీఎం రేవంత్ ఉన్నట్లు మంత్రి తుమ్మల చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం పౌరసరఫరాల సంస్థకు రూ.50వేల కోట్లు బాకీ పడగా అందులో రూ.12వేల కోట్లను తమ ప్రభుత్వం తీర్చిందని వెల్లడించారు. మిగిలిన మొత్తాన్ని దశల వారీగా చెల్లిస్తామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన కీలక పత్రాలు మాయమయ్యాయని మంత్రి ఆరోపించారు.
FAQ