TG Nursing Officers Examination Key Released; తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్లు “కీ” విడుదల 2024
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నర్సింగ్ అభ్యర్థులకు పరీక్ష నిర్వహించగా ఆ పరీక్షకు సంబంధించి ప్రిలిమినరీ కీ ని విడుదల చేసింది.
TG Nursing Officers Examination Key Released తెలంగాణాలో నర్సింగ్ అభ్యర్థులకు ఈ సంవత్సరం సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన 2050 పోస్టులను భర్తీ చేసేందుకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే అభ్యర్థులకు నవంబర్ నెలలో పీకంప్యూటర్ ఆధారితన పరీక్షను నిర్వహించింది.అభ్యర్థులకు తొలి కీ ని విడుదల చేసింది.అభ్యర్థులు తమ రెస్పాన్స్ సీట్ డౌన్లోడ్ చేసుకొని తమకు ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకునేందుకు అవకాశం ఉంది. “కీ” పైన అభ్యర్థులకు అభ్యంతరాలు ఉంటే అధికారిక వెబ్సైట్ లో నవంబర్ 28 సాయంత్రం ఐదు గంటల లోపు Key Objections పెట్టుకోవచ్చు. అభ్యంతరాలు పెట్టే ప్రతి ఒక్క అభ్యర్థి మాస్టర్ క్వశ్చన్ పేపర్ లో ఉన్న క్వశ్చన్ ఐడీల ఆధారంగా అబ్జెక్షన్ పెట్టాలి.
రెండు సెషన్స్ లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించడం కారణంగా బోర్డు ముందుగానే తెలియజేసిన విధంగా మార్కుల నార్మలైజేషన్ చేస్తారు. ఈ విధంగా నార్మలైజేషన్ చేయడం వలన అభ్యర్థులకు “కీ” చూసిన తర్వాత వచ్చిన మార్కులకు నార్మలైజేషన్ చేసిన తర్వాత వచ్చిన మార్కులకు తేడా ఉంటుంది. అంటే నార్మలైజేషన్ చేయడం వలన సులభంగా వచ్చిన షిఫ్ట్ లో రాసిన అభ్యర్థులకు మార్కులు సంఖ్య నార్మలైజేషన్ చేసిన తర్వాత తగ్గుతుంది. కఠినంగా వచ్చిన షిఫ్ట్ లో పరీక్ష రాసిన అభ్యర్థులకు నార్మలైజేషన్ చేసిన తర్వాత మార్కుల సంఖ్య పెరుగుతుంది..
ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు రెండు సెషన్స్ లో కూడా ప్రశ్నాపత్రం కఠినంగా వచ్చిందని తెలిపారు. దీని కారణంగా కట్ ఆఫ్ మార్కులు భారీగా తగ్గే అవకాశం ఉంది.కీ” పైన అభ్యర్థులకు అభ్యంతరాలు ఉంటే అధికారిక వెబ్సైట్ లో నవంబర్ 28 సాయంత్రం ఐదు గంటల లోపు Key Objections పెట్టుకోవచ్చు. అభ్యర్థులు ఒక్కసారి మాత్రమే ఇలా అబ్జెక్షన్ పెట్టడానికి అవకాశం ఉంది. ఒకేసారి ఎన్ని ప్రశ్నలకైనా Key Objections పెట్టవచ్చు. ఈ విధంగా గ్రీవెన్స్ పెట్టడానికి అభ్యర్థులు తప్పనిసరిగా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ PDF లేదా JPEG Format లో అప్లోడ చేయాలి.
- ఇందులో 80 పాయింట్లు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు.
- 2. 20 పాయింట్లు గతంలో కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ విధానంలో ప్రభుత్వ ఆసుపత్రులు, సంస్థలు, ప్రోగ్రాం లలో పనిచేసిన వారికి వెయిటిజి మార్కులు ఇస్తారు.