Gowtham Adani Loss the shares today 2024: గౌతం అదానీతో పాటు మరో ఏడుగురిపై కేసు

Photo of author

By Admin

Gowtham Adani Loss the shares today 2024: గౌతం అదానీతో పాటు మరో ఏడుగురిపై కేసు

లంచం, ఫ్రాడ్ ఆరోపణలతో న్యూయార్క్ ఆయనతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదైంది. 2 బిలియన్ డాలర్ల లాభం పొందేందుకు సోలార్ ఎలక్ట్రిసిటీ సప్లై కాంట్రాక్ట్ కోసం భారత అధికారులకు సుమారు 250 మిలియన్ డాలర్ల లంచం ఇచ్చినట్లు అభియోగాలు నమోదయ్యాయి.

Gowtham Adani Loss the shares today 2024 భారత పారిశ్రామికవేత్త గౌతం అదానీ చిక్కుల్లో పడ్డారు.US ఇన్వెస్టర్ల నుంచి అక్రమంగా పెట్టుబడులు స్వీకరించారనే ఆరోపణలతో కోర్టు వారెంట్ జారీ చేసింది.న్యూయార్క్ డిస్ట్రిక్ట్ కోర్టు లంచం, ఫ్రాడ్ అభియోగాలు నమోదు చేయడంతో ఆయనతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదైంది. 2 బిలియన్ డాలర్ల లాభం పొందేందుకు సోలార్ ఎలక్ట్రిసిటీ సప్లై కాంట్రాక్ట్ కోసం భారత అధికారులకు సుమారు 250 మిలియన్ డాలర్ల లంచం ఇచ్చినట్లు అభియోగాలు నమోదయ్యాయి.దీంతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు క్రాష్ అయ్యాయి. దాదాపుగా అన్ని కంపెనీల షేర్లు రోజువారీ లోయర్ సర్క్యూటు తాకాయి.

దీంతో 11 కంపెనీల స్టాక్స్ విలువ రూ.2.25 లక్షల కోట్లు తగ్గి రూ.12 లక్షల కోట్లకు చేరుకుంది. ఇక ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ జాబితా ప్రకారం గౌతమ్ అదానీ సంపద $10.5 బిలియన్లు తగ్గి $59.3 బిలియన్లకు చేరుకుంది.రూ.5000 కోట్ల విలువైన డాలర్ బాండ్ల జారీని నిలిపివేస్తున్నామని అదానీ గ్రూప్ ప్రకటించింది. ఈ మేరకు NSEకి లేఖ రాసింది. న్యూయార్క్ డిస్ట్రిక్ట్ కోర్టులో అభియోగాలు నమోదవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. రెన్యూవబుల్ ఎనర్జీ బిజినెస్ను విస్తరించేందుకు విదేశాల్లో నిధులు సమీకరించాలని అదానీ గ్రూప్ భావించింది. ఇందుకోసం డాలర్ డినామినేషన్లో బాండ్ల జారీకి సిద్ధమైంది. ఈ కేసుతో ఆ దారి మూసుకుపోయింది.

అదానీ గ్రూప్తో కుదుర్చుకున్న రెండు భారీ ప్రాజెక్టులను రద్దు చేస్తున్నట్లు కెన్యా ప్రకటించింది.పవర్ ట్రాన్స్ మిషన్ లైన్స్ నిర్మించేందుకు 700 మిలియన్ డాలర్ల ఎనర్జీ ఒప్పందాన్ని క్యాన్సిల్ చేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు విలియం రుతో వెల్లడించారు. దాంతో పాటు JKI విమానాశ్రయాన్ని విస్తరించేందుకు జరుపుతున్న ప్రణాళికలను నిలిపివేస్తున్నామన్నారు.అదానీపై అమెరికా మోపిన అభియోగాల్లో గత ప్రభుత్వం పేరు కూడా ఉంది. ఆనాటి ఏపీ ప్రభుత్వానికి రూ. 1,750 కోట్ల లంచం ఇచ్చి సౌర విద్యుత్ ఒప్పందం కుదుర్చుకున్నారని అమెరికా ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. 2021లో అదానీ అప్పటి సీఎం జగన్ను కలిసిన తర్వాత ‘సెకీ’ ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. అదానీ పవర్ నుంచి కొన్న విద్యుత్ ఏపీకి ఇవ్వాలని ‘సెకీ’ నిర్ణయించినట్లు వివరించారు.

అదానీపై అమెరికాలో కేసు నమోదవడంపై BRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ‘అఖండ భారతంలో అదానికో న్యాయం.. ఆడబిడ్డకో న్యాయమా? ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్టు చేయడం ఈజీ. ఆధారాలు ఉన్నా అదానీని అరెస్టు చేయడం మాత్రం కష్టమా? ఎన్నిసార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానీ వైపేనా??’ అని ట్వీట్ చేశారు.అదానీ చేశారన్న రూ.2000 కోట్ల స్కామ్ కాంగ్రెస్ సహా పలు ప్రాంతీయ పార్టీల మెడకే చుట్టుకొనేలా ఉంది. తమ నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలని అదానీ+అజూర్ పవర్ కంపెనీలు 2021-22 మధ్య 4 రాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందాలు చేసుకున్నాయి. అందుకే $256M లంచాలుగా ఇచ్చారని NYC కోర్టు ఆరోపిస్తోంది. అప్పుడు ఛత్తీస్ గఢ్ (INC), తమిళనాడు (DMK), ໖໖ (YCP), ໕໕ (BJD) BJP రాష్ట్రాలు కావు. ఇప్పుడిదే కీలకంగా మారింది.

FAQ

Leave a Comment