Praja Vaani: మళ్ళీ మొదలైన ప్రజ వాని
తెలంగాణ ప్రభుత్వం 6 నెలలకు ఒకసారి ప్రజల సమస్యలను దరఖాస్తుల రూపంలో తీసుకుంటుంది.
Praja Vaani: మళ్ళీ మొదలైన ప్రజ వాని
రైతుప్రస్థనం: తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ప్రభుత్వానికి మద్య వారధిగా ఉన్న ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణను మళ్ళీ మండలాల వారీగా పునప్రారంభించింది.దీనికి సంబంధించి ఇప్పటికే కలెక్టర్లు కు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజ సమస్యలను దరఖాస్తుల రూపంలో తీసుకుంటూ వారికి ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తుంది.దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని అప్లికేషన్స్ ప్రజల దగ్గర నుండి తీసుకుంది.ప్రజాపాలన మొదలు పెట్టిన నాటి నుండి ఈ స్కీంకి చాల ఆదరణ అయితే పొందింది.
ఖమ్మంలో ప్రజ వాని
ఖమ్మం జిల్లా కలెక్టర్ శ్రీ ముజమ్మిల్ ఖాన్ ఐ.ఎ.ఎస్ ప్రజ వాని ద్వారా దరఖాస్తులు తీసుకోవాలి అని మండల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులో ఎక్కువ మొత్తంలో రెవిన్యూ కి సంభందించిన దరఖాస్తులు ఉండడం గమనార్హం.ఈ కార్యక్రమాన్ని మొదటగా జిల్లా కేంద్రంలో ప్రతి సోమవారం నిర్వహించారు ఇప్పుడు గ్రామాల వారీగా రైతులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను గురించి అప్లికేషన్స్ తీసుకోనున్నారు.మండలాల్లో వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు తనకు నివేదికల రూపంలో పంపించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.మండల కార్యదర్శి కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహించడం పై సానుకూల స్పందన వస్తోందని కలెక్టర్ తెలిపారు.ఆయా మండలాల్లో ఇప్పటివరకు నిర్వహించిన ప్రజావాణిలో ఒచ్చిన దరఖాస్తులు 536 దరఖాస్తులు రాగా అందులో ఎక్కువ మోతాదులో రెవిన్యూ శాఖకు సంబంధించి దరఖాస్తులు ఎక్కవగా ఉన్నాయని తెలిపారు.దాదాపుగా ఒక్క రెవిన్యూ శాఖ దరఖాస్తులు 363 ఉన్నాయని కలెక్టర్ తెలిపారు .మిగిలిన దరఖాస్తులో పంచాయతీ రాజ్ కు సంబంధించి 77 దరఖాస్తులు, జిల్ల పరిషత్కు సంబంధించి 31,వ్యవసాయానికి సంబంధించి 22 అర్జీలు ఒచ్చినట్టు తెలిపారు.
ఎక్కడి సమస్య అక్కడినుంచే తీర్మానం
ప్రజ వాణి ద్వారా వస్తున్న దరఖాస్తులను ఎక్కడివి అక్కడే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.సమస్య పరిష్కారం సానుకూలంగా ఉండాలని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగ కుండా సమస్యను పరిష్కరించాలని తెలియజేశారు.కలెక్టరేట్లో నిర్వహించే గ్రీవెన్స్ డే కు 135 అర్జీలు వచ్చాయి. వీటిలో 35 ధరణికి సంబంధించినవి కాగా, మిగతా 100 అర్జీలు పెన్షన్, కల్యాణ లక్ష్మి, రైతుబంధు, దళితబంధు, రుణమాఫీ, పాస్ పుస్తకాల సవరణ ఇతరేతర సమస్యలపై వచ్చాయి. అడిషనల్ కలెక్టర్ ఎన్. మధుసూదన్ నాయక్ కు అర్జీలు స్వీకరించారు.లేని భూమిని ఉన్నట్లుగా నష్ట పరిహారం వీఆర్ఎ సృష్టించి పొందేందుకు ప్రయత్నిస్తున్నట్లు సత్తుపల్లిలో జరిగిన ప్రజావాణిలో యోగేశ్వరరావుకు గ్రామస్తులు తహసీల్దార్ యాతాలకుంట వెంకటనారాయణ, మరియమ్మ ఫిర్యాదు చేశారు. ఇక్కడ పలు సమస్యలపై 22 దరఖాస్తులు వచ్చాయి.కామేపల్లిలో తహసీల్దార్ సుధాకర్ అర్జీలు స్వీకరించగా రెండు దరఖాస్తులు వచ్చాయి.కల్లూరు మండలంలో ఆసరా పెన్షన్లు, గ్యాస్ సబ్సిడీ, రుణమాఫీ, భూ సమస్యలు పట్టాదార్ పాస్ పుస్తకాల కోసం ప్రజలు దరఖాస్తులు సమర్పించారు.
జిల్లాలో ఏ సమస్యలున్న ప్రజ వాణి ద్వారా తమ సమస్యలు తెలియజేయాలని.ఎలా ఐతేనే పరిష్కార మార్గాలు సులువుగా ఉంటాయని తెలిపారు.