ktr-calls-prabhas-under-18-world-promo
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల ‘ది అండర్ 18 వరల్డ్’ అనే పిల్లల కార్యక్రమంలో పాల్గొని వారితో సరదాగా ముచ్చటించారు.
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల ‘ది అండర్ 18 వరల్డ్’ అనే పిల్లల కార్యక్రమంలో పాల్గొని వారితో సరదాగా ముచ్చటించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ప్రోమోలో భాగంగా పిల్లలు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ ఆసక్తికరంగా సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా హీరో ప్రభాస్‌కు ఫోన్ చేసి మాట్లాడడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పిల్లలు అడిగిన కొన్ని సరదా ప్రశ్నలకు కేటీఆర్ నవ్వుతూ, తల పట్టుకున్నట్లు కనిపించారు.అలాగే, ఒక చిన్నారితో కలిసి పుష్-అప్స్ చేయడం కూడా ప్రోమోలో చూపించారు. ఇదే సమయంలో ఆయన సతీమణి నుంచి ఫోన్ రావడంతో, “కొద్దిసేపట్లో తిరిగి కాల్ చేస్తాను” అని చెప్పి కాల్ ముగించిన సన్నివేశం కూడా ఆకట్టుకుంది.సరదా సంభాషణలు, ఆసక్తికరమైన ప్రశ్నలు, వినోదభరిత క్షణాలతో నిండిన ఈ ఇంటర్వ్యూ పూర్తి వీడియోను త్వరలో విడుదల చేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ ప్రోమోకు మంచి స్పందన లభిస్తోంది.
- Youtube Channel: Click Here
- Horror Stories: Click Here
- Entertainment: Click Here
- Join Whats App: Join










