- PM kisan 23rd installment releasing date fix
దేశవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan Samman Nidhi) 23వ విడత నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. రేపే అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి ₹2,000 జమ కానున్నాయి.
అసలు ఈ 23వ విడత నిధులను ఎవరు, ఎక్కడ విడుదల చేస్తున్నారు? మీ ఖాతాలో డబ్బులు పడతాయో లేదో మొబైల్లోనే ఎలా చెక్ చేసుకోవాలో ఈ ఆర్టికల్‌లో పూర్తి వివరంగా తెలుసుకుందాం.
PM కిసాన్ 23వ విడత: ఎవరు? ఎక్కడ విడుదల చేస్తున్నారు?
పీఎం కిసాన్ 23వ విడత నిధులను మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అధికారికంగా విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమం పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లా, తారకేశ్వర్ (Tarakeswar, Hooghly) వేదికగా జరగనుంది.
రేపు అక్కడ నిర్వహింmచబోయే భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ గారు డిజిటల్ బటన్ నొక్కి, ఒకే ఒక్క క్లిక్‌తో దేశవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) ద్వారా నేరుగా ₹2,000 చొప్పున నిధులను బదిలీ చేయనున్నారు.
మీ మొబైల్లోనే PM కిసాన్ స్టేటస్ చెక్ చేసుకోండిలా..
మీ అకౌంట్లో 23వ విడత డబ్బులు పడతాయో లేదో తెలుసుకోవడానికి మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. మీ మొబైల్లోనే కేవలం రెండు నిమిషాల్లో స్టేటస్ చెక్ చేసుకోవచ్చు:
- వెబ్సైట్ ఓపెన్ చేయండి: మొదట పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ pmkisan.gov.in ను సందర్శించండి.
- ‘Know Your Status’ పై క్లిక్ చేయండి: హోమ్‌పేజీలో కిందకు స్క్రోల్ చేస్తే ‘Farmers Corner’ సెక్షన్లో మీకు ‘Know Your Status’ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి.
- వివరాలు నమోదు చేయండి: మీ పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నంబర్ (Registration Number) మరియు స్క్రీన్‌పై ఉన్న క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయండి. (ఒకవేళ రిజిస్ట్రేషన్ నంబర్ తెలియకపోతే, అక్కడే ఉన్న ‘Know Your Registration Number’ పై క్లిక్ చేసి ఆధార్ లేదా మొబైల్ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చు).
- OTP వెరిఫికేషన్: ఆ తర్వాత ‘Get OTP’ బటన్ నొక్కండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే OTPని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే, మీ పేమెంట్ స్టేటస్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
ఈ మూడు పనులు పూర్తి కాకపోతే డబ్బులు రావు!
పీఎం కిసాన్ లబ్ధిదారులు తమ స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు కింద పేర్కొన్న మూడు అంశాలు ఖచ్చితంగా ‘YES’ అని ఉండాలి. ఒకవేళ ‘NO’ అని ఉంటే మీకు 23వ విడత డబ్బులు రావు:
-
- e-KYC Status: మీ ఆధార్ ఆధారిత ఇ-కేవైసీ (e-KYC) పూర్తయి ఉండాలి.
- Eligibility: మీరు ఈ పథకానికి అర్హులై ఉండాలి (Eligibility – YES అని ఉండాలి).
- Land Seeding: మీ భూమి వివరాలు పీఎం కిసాన్ పోర్టల్‌లో ఖచ్చితంగా సీడింగ్ అయి ఉండాలి.
ముఖ్య గమనిక: మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ (NPCI mapping) కూడా ఖచ్చితంగా అయి ఉండాలి. ఒకవేళ ఇ-కేవైసీ లేదా ల్యాండ్ సీడింగ్ పెండింగ్‌లో ఉంటే వెంటనే మీ సమీపంలోని సీఎస్సీ (CSC) కేంద్రాన్ని లేదా వ్యవసాయాధికారిని కలవండి.
ఈ సమాచారాన్ని తోటి రైతు సోదరులకు కూడా షేర్ చేసి, వారు కూడా తమ స్టేటస్ చెక్ చేసుకునేలా సహాయపడండి!










