KTR came out after completing Ed’s Enquiry 25: గంటల సూదీర్గ విచారణ తరువాత బయటకు వచ్చిన KTR
బషీర్ బాగ్ ఈడీ కార్యాలయానికి వచ్చిన కేటీఆర్ ఎంట్రీ పోలీసులకు ముచ్చెమటలు పట్టించేలా చేసింది.ఒకపక్కన భారీ బందోబస్తు, వారిని మించిన మీడియా ప్రతినిధులు, మరోపక్క ఆయన అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలతో రోడ్డు కిక్కిరిసిపోయింది.
ఫార్ములా-ఈ కారు రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ HYDలోని తన నివాసం నుంచి నేరుగా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో ఈడీ కార్యాలయానికి బీఆర్ఎస్ నేతలు భారీగా చేరుకోగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.బషీర్ బాగ్ ఈడీ కార్యాలయానికి వచ్చిన కేటీఆర్ ఎంట్రీ పోలీసులకు ముచ్చెమటలు పట్టించేలా చేసింది. ఒకపక్కన భారీ బందోబస్తు, వారిని మించిన మీడియా ప్రతినిధులు, మరోపక్క ఆయన అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలతో రోడ్డు కిక్కిరిసిపోయింది. కేటీఆర్ కార్ లోపలికి పంపేందుకు పోలీసులు నానా తంటాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈడీ కార్యాలయం ముందు బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టడంతో నేతలను పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కు తరలించారు.
సుమారు 7 గంటలుగా ఆయనపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. HMDA ఖాతా నుంచి విదేశీ సంస్థకు నిధుల బదిలీపై ఆరా తీస్తున్నారు. అర్వింద్ కుమార్, BLN రెడ్డి వాంగ్మూలాల ఆధారంగా KTRను క్వశ్చన్ చేస్తున్నట్లు సమాచారం. కాగా మాజీ మంత్రి చెప్పినట్లే తాము చేశామని ఇటీవల ఈడీ విచారణకు హాజరైన అర్వింద్, రెడ్డి చెప్పినట్లు సమాచారం.ఈడీ కార్యాలయం వద్ద హైడ్రామా నెలకొంది. కేటీఆర్ విచారణ ముగిసిందని తెలిసి బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సహా కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. అయితే వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు సూచించారు. అక్కడే ఉంటామని పలువురు కార్యకర్తలు తెగేసి చెప్పడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో కేటీఆర్ బయటికి వస్తారా? లేదా? అని ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు పార్టీ ఫిరాయింపులపై BRS సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలె యాదయ్య, సంజయ్ కుమార్, కృష్ణ మోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, గాంధీలపై రిట్ పిటిషన్ వేసింది. ఈ కేసుపై హరీశ్ రావు ఢిల్లీలో న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు.