CM Revanth Reddy Good News to Employees 2026: పెన్షనర్లకు రూ.1.20 కోట్ల ప్రమాద బీమా

CM Revanth Reddy Good News to Employees

ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి ఆరోగ్య పథకం, ప్రమాద బీమా సౌకర్యం కల్పించి తమ దశాబ్దాల కోరిక నెరవేర్చారంటూ ఉద్యోగ, పెన్షనర్ల సంఘాల నాయకులు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు.

ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి ఆరోగ్య పథకం, ప్రమాద బీమా సౌకర్యం కల్పించి తమ దశాబ్దాల కోరిక నెరవేర్చారంటూ ఉద్యోగ, పెన్షనర్ల సంఘాల నాయకులు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగులు, పెన్షనర్లకు రూ.1.20 కోట్ల ప్రమాద బీమా వర్తింపజేయడంతో పాటు, రూ.1,056 కోట్ల మూలనిధితో ఆరోగ్య పథకానికి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలపడంపై ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలియజేశారు.ప్రభుత్వం ప్రకటించిన ఈ పథకాలు చరిత్రలో నిలిచిపోతాయని, 1,998 వ్యాధులకు నగదు రహిత చికిత్సలు పొందే అవకాశం కల్పించడం ఉద్యోగులకు, పెన్షనర్లకు ఒక వరమని కొనియాడారు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని క్యాబినెట్ ఉద్యోగ వర్గాల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ తీసుకున్న ఈ నిర్ణయాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తాయని ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు పేర్కొన్నారు.

Leave a Comment