Unknown person attacked to saif ali khan 2025: ఖాన్ పైన గుర్తు తెలియని వ్యక్తి దాడి
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేయడంతో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి.దాడికి పాల్పడిన వ్యక్తి ఎవరు?
నిన్న బాలివుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ పైన గుర్తు తెలియని వ్యక్తి ఒకరు కత్తితో దాడి చేయడంతో తీవ్ర గాయాలు అయ్యాయి.ఎందుకు దాడి చేశారనే వివరాలు తెలియాల్సి ఉంది.వివరాల్లోకి వెళితే ముంబైలోని సైఫ్ నివాసంలోకి అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తి ఆయన పనిమనిషితో వాగ్వాదానికి దిగాడు. సైఫ్ జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించగా దుండగుడు కత్తితో అటాక్ చేసి, పరారయ్యాడు. దీంతో ఈ నటుడికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సర్జరీ చేయాల్సి ఉందని వైద్యులు తెలిపారు.
సైఫ్ అలీఖాన్‌ను ఆగంతుకుడు ఆరుసార్లు కత్తితో పొడిచారని లీలావతీ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అందులో రెండు గాయాలు మరీ లోతుగా ఉన్నాయని పేర్కొన్నాయి. న్యూరోసర్జన్ డాక్టర్ డింగే, కాస్మొటిక్ సర్జన్ డాక్టర్ జైన్ ఆయనకు సర్జరీ చేస్తున్నట్లు వెల్లడించాయి. సైఫ్‌ను చూసేందుకు భార్య కరీనా, ఆమె సోదరి కరిష్మా ఉదయం 4:30 గంటలకే ఆస్పత్రికి వచ్చారని తెలిసింది. దాడిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఈయన ఎన్టీఆర్ కొరటాల శివ దర్కత్వంలో వచ్చిన దేవర సినిమాలో ప్రతి నాయకుడిగా నటించిన విషయం తెలిసిందే..దేవర రెండవ భాగం షూటింగ్లో ఉండగా ఇలా జరగడంపై దేవర టీం దిగ్భ్రాంతికి గురైంది..ఆయన త్వరగా కోలుకోవాలని పలువురు ట్వీట్స్ చేస్తున్నారు..