CS Order to Collectors Paste the Eligible list: అర్హుల జాబితాను 21 నుంచి గ్రామ పంచాయతీల్లో

Photo of author

By Admin

CS Order to Collectors Paste the Eligible list: అర్హుల జాబితాను 21 నుంచి గ్రామ పంచాయతీల్లో

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ జనవరి 26 తర్వాత నాలుగు పథకాలను అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. వాటికి సంబంధించి కీలక అప్డేట్ అయితే చేశారు…

రేవంత్ సర్కార్ ఎలక్షన్ హామీల్లో ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీ ల అమల్లో భాగంగా కొన్నిటిని అమలు చేసి మరికొన్నింటిని ఈ జనవరి 26 తర్వాత అమలు చేయడానికి ఈనెల 11 నుంచి 15 వరకు ప్రీ పనులను చేసిన విషయం తెలిసిందే ఇప్పటికే గ్రామ సభల ద్వారా అర్హులను ఎంపిక చేస్తూ వచ్చారు రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులకు సంబంధించి గుర్తింపు జరిగింది ఈ అర్హుల జాబితాను 21 నుంచి గ్రామ పంచాయతీల్లో ఉంచాలని తెలంగాణ సిఎస్ తెలపడం జరిగింది.

ఇప్పటికే విడుదల చేసిన మార్గదర్శకాల మేరకు అర్హులను గుర్తించి జాబితాలను ఈ నెల 21 నుంచి గ్రామసభల్లో ప్రదర్శించాలని ఆదేశించారు. GHMCలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ నెల 26 నుంచి పథకాలను అమలు చేస్తామని ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే. ఈనెల 16 నుంచి 20వ తారీకు వరకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అర్హులను గుర్తిస్తారని పొన్నం ప్రభాకర్ అయితే తెలిపారు మరో నాలుగు రోజుల్లో పథకాలకు సంబంధించి గ్రామ పంచాయతీల్లో ఎవరు అర్హులని జాబితాను విడుదల చేస్తారని సిఎస్ శాంతి కుమారి తెలపడం జరిగింది. దీంతో వరికి వస్తాయో ఎవరికీ రావో అనే ఆందోళన ప్రజల్లో అయితే మొదలైంది.

Leave a Comment