Revanth Reddy New Scheme with 50% subsidy: ఒక ఎకరానికి రూ. 3 లక్షల వ్యయంతో పందిళ్లు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మరొక కొత్త స్కీము అయితే విడుదల చేయబోతుంది. ఈ స్కీం ద్వారా 50% సబ్సిడీ అయితే అందనుంది.
రాష్ట్రంలో రేవన్ సర్కార్ ఇప్పటికే పలు రకాల స్కీములను అందుబాటులోకి తీసుకొచ్చింది మరియు కొత్త స్కీం లను కూడా ఒకటొకటిగా రిలీజ్ చేస్తూ వస్తోంది ఎప్పటికే రైతులకు రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసానిధులను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది ఇప్పటికే మూడు దశల్లో 19 కోట్ల వరకు రాష్ట్ర రైతులకు రేవంత్ సర్కార్ రుణమాఫీని విడుదల చేసింది రుణమాఫీ కానీ రైతులకు మరోసారి రుణమాఫీని విడుదల చేయడం కోసం నిధులను రెడీ చేసుకుంది జనవరి 26 తర్వాత 4 పథకాలను విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది ఇప్పటికే రైతు వేదికలు రైతు సభల ద్వారా పథకాల గురించి రైతులకు తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా రైతుల కోసం మరో కొత్త పథకాన్ని విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
మరో రెండు మూడు రోజుల్లో ఈ పథకానికి విధివిధానాలు ఖరారు అయితాయని ప్రభుత్వాన్ని పనులు చెబుతూ ఉన్నారు. పంట పెట్టుబడి సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాను తీసుకువచ్చింది అలాగే కూరగాయలు పండించే రైతుల కోసం కొత్త పథకాన్ని తీసుకురానుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా రైతులకు మూడు లక్షల వరకు లోన్ ఇవ్వనుంది అలాగే 50% వరకు సబ్సిడీ ఇవ్వనుంది.శాశ్వత పందిళ్లు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకునేందుకు సాయం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక ఎకరానికి రూ. 3 లక్షల వ్యయంతో ఈ పందిళ్లు నిర్మాణం చేయగా, ఇందులో 50% సబ్సిడీ అందించనుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని మొదటగా నిజామాబాద్ జిల్లాలోని బోధన్ లో ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నారు. ముఖ్యంగా తీగ జాతి కూరగాయల సాగుకు ఈ పథకం ప్రత్యేకంగా దోహదం చేస్తుందని వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించారు. ఈ పథకానికి అవసరమైన నిధులను వ్యవసాయ మార్కెట్ కమిటీ నుంచి వినియోగిస్తారని సమాచారం. త్వరలోనే ఈ పథకానికి సంబంధించిన నిబంధనలు ఖరారుకానున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం వెదురు సాగును ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నాలుగేళ్లలో 7 లక్షల ఎకరాల్లో వెదురు సాగు చేసి, 75 వేల మంది రైతులకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో సర్కార్ ముందడుగు వేసింది. ఈ పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా నాగర్ కర్నూల్ భూపాల్ పల్లి భద్రాద్రి కొత్తగూడెంలో ప్రారంభించనుంది.ప్రభుత్వ నర్సరీల ద్వారా మొక్కలు పెంచి రైతులకు పంపిణీ చేయనుంది. ఒక్క ఎకరంలో 60 మొక్కలు నాటే అవకాశం ఉంది. ఈ పంట 30 ఏళ్ల పాటు సాగు చేయవచ్చు. ఎకరానికి రూ. 20 వేల పెట్టుబడితో సంవత్సరానికి రూ. 40,000 నుంచి రూ. 60,000 వరకు ఆదాయం లభించే అవకాశముంది.