RBI giving 2 lakhs Crop Loan without Interest: పంటలపై ఎలాంటి తనఖా లేకుండా బ్యాంకు 2 లక్షల రుణాలు
రైతులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది రైతులకు వడ్డీ లేకుండా రెండు లక్షల వరకు రుణాలను ఇవ్వాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ..
పంట కోసం రైతులు బ్యాంకులో దగ్గర నుంచి రుణాలను తీసుకుంటూ ఉంటారు ఆ రుణాలను బ్యాంకులో తనకా లేకుండా అయితే ఇవ్వవు. తనకా లేకుండా బ్యాంకులో 50వేల వరకు రుణాలను ఇచ్చేది కానీ అవి సరిపోకపోవడంతో రైతులు తనకా పెట్టి రుణాలను తీసుకునేవారు అయితే ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కనుక లేకుండా పంటలపై రైతులు రెండు లక్షల వరకు రుణాలను తీసుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది ఈ ప్రక్రియను అమలు చేయడానికి ఆర్.బి.ఐ నేటి నుంచే ఆదేశాలను జారీ చేయడం జరిగింది..చిన్న, సన్నకారు రైతులకు రుణాల మంజూరు విషయంలో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలాంటి హామీ లేకుండా చిన్న, సన్నకారు రైతులకు మంజూరు చేసే రుణాల పరిమితిని లక్షా 66 వేల నుంచి 2 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్బీఐ శుక్రవారం వెల్లడించింది. మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ ప్రకటన చేశారు.
వ్యవసాయంలో రైతులకు పెట్టుబడులు పెరగడం, రాబడి తగ్గడం. దేశంలో నెలకొన్న ద్రవ్యోల్బణ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు.. ఇలా పలు కారణాల వల్ల రైతులకు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా అంటే బ్యాంకులో తనక పెట్టకుండా బ్యాంకులు ఇచ్చే పంట రుణాల పరిమితిని పెంచుతున్నామని ఆర్బీఐ గవర్నర్ ప్రకటించారు.రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా చివరిగా హామీ అక్కర్లేని పంట రుణాల పరిమితిని 2019లో మార్చింది. అప్పటివరకూ లక్ష రూపాయలు ఉన్న పరిమితిని లక్షా 60 వేలకు మార్చింది. ఇప్పుడు ఈ పరిమితిని 2 లక్షలకు పెంచింది. ఈ నిర్ణయంపై రైతుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఇదిలా ఉండగా.. కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ యథాతథంగా ఉంచింది. వడ్డీ రేట్లను యథాతథంగా 6.5 శాతంగానే ఉంచింది. పలు రైతులు వడ్డీరేట్లను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు దీనిపై ఆర్బిఐ ఎలా స్పందిస్తుంది అనే దాని గురించి వేచి చూడాల్సిందే…