Telangana New Revenue Act 2024: భూమి రిజిస్టర్
తెలంగాణ రైతులకోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త రెవిన్యూ చట్టాన్ని అమలు చేస్తోంది ఈ చట్టం ద్వారా పెండింగ్లో ఉన్న 9. 4 క్షల సాదాబైనామా దరఖాస్తుమను పరిష్కరించనుంది.
- 1.1.చట్టం ప్రతిపాదన
- 1.2.రైతులకు లాభం ఏంటి ?
- రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్)’లో నమోదు చేయాలా ?
- వారసత్వ భూమిలా బదలాయింపు ఎలా ?
- మ్యూటేషన్ రద్దు అయ్యే ఛాన్స్ ఉంద ?
- భూమి మ్యాప్ తప్పనిసరి
- వారసత్వ భూముల మ్యుటేషన్ అధికారం
- సాదాబైనామా
Telangana New Revenue Act 2024
-
Telangana New Revenue Act 2024: భూమి రిజిస్టర్ పాస్బుక్లలు రాని భూముల సమస్యలను పరిష్కరించడం, సర్వే చేసి కొత్తగా భూహ క్కుల రికార్డు తయారు చేసుకునే అధికారాన్ని కల్పించడమే ప్రధాన ఉద్దేశాలుగా ఈ చట్టాన్ని రూపొందిస్తున్నట్టు పేర్కొంది.
- చట్టం ప్రతిపాదన
వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తులపై హక్కులను నమోదు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురానుందిచాలా సేవలు సులభంగా, వేగంగా అందడంతో పాటు రెవెన్యూ వ్యవస్థ బలోపేతం అవుతుందని, ఒకరిద్దరి అవసరాలకు కాకుండా భవిష్యత్తు తరాలకూ ఉపయోగపడేలా రికార్డ్ ఆఫ్ రైట్స్(ఆర్‌వోఆర్) చట్టం-24 ముసాయిదా ఉందని అన్నారు. - పాస్బుక్లలు రాని భూముల సమస్యలను పరిష్కరించడం, సర్వే చేసి కొత్తగా భూహ క్కుల రికార్డు తయారు చేసుకునే అధికారాన్ని కల్పించడమే ప్రధాన ఉద్దేశాలుగా ఈ చట్టాన్ని రూపొందిస్తున్నట్టు పేర్కొంది. పలువురు దీనిపై స్పందిస్తూ ముసాయిదా బిల్లు రైతులకు సానుకూలంగా ఉందని చెబుతున్నారు.
- రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్)’లో నమోదు చేయాలా ?
- రిజ్స్స్టేషన్, మ్యుటేషన్, భూ ఆధార్, ఆబాదీలకు ప్రత్యేక హక్కుల రికార్డు, అప్పీల్, రివిజన్ వంటి సెక్షన్లను ముసాయిదా బిల్లులో ప్రతిపాదించారు. భూమి హక్కుల కోసం 18 రకాల పద్ధతులను అయితే ఇందులో ఉంచారు.ఏ రకంగానైన హక్కుల బదలాయింపు జరిగినా ‘రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్)’లో నమోదు చేయాల్సి ఉంటుంది.
- వారసత్వ భూమిలా బదలాయింపు ఎలా ?
- వారసత్వంగా వస్తున్న భూములు,దస్తావేజులు,భాగలు పంచుకోవడం ద్వారా వచ్చిన హక్కుల బదలాయింపునకు పాత చట్టంలో ఉన్న నిబంధనను కొనసాగించారు. ఈ పద్ధతుల్లో తహసీల్దారే రిజిస్టేషన్, మ్యుటేషన్ చేస్తారు.రిజిస్టర్డ్ దస్తావేజులు, భాగ పంపకాలు,
- మ్యూటేషన్ రద్దు అయ్యే ఛాన్స్ ఉంద ?
- అయితే మ్యుటేషన్ చేసే సమయంలో విచారణ జరిపే వెసులుబాటు కూడా కొత్త చట్టంలో ఉంటుంది.విచారణ సమయంలో తప్పులేమైనా గుర్తిస్తే ఆయా కారణాలను వివరిస్తూ మ్యుటేషన్ అయితే నిలిపేయవచ్చు. ఇప్పటి చట్టంలో అయితే అవకాశం లేదు.
- భూమి మ్యాప్ తప్పనిసరి
- రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేసేటప్పుడు సర్వే మ్యాప్ తప్పనిసరి చేశారు. రిజిస్ట్రేషన్కు వెళ్లేవారు ఈ మ్యాప్ను తీసుకెళ్లాల్సి ఉంటుంది. భవిష్యత్తు వివాదాలకు చెక్ పెట్టేలా.గతంలో లేని ఈ కొత్త నిబంధనను అయితె తెస్తున్నారు.
- వారసత్వ భూముల మ్యుటేషన్ అధికారం
- వారసత్వ హక్కుల మ్యుటేషన్ను విచారించే అధికారం తహసీల్దార్లకు ఉంటుంది. మిగతా అంశాలకు సంబంధించి ఆర్డీవోకు అధికారం ఉంటుంది.
- సాదాబైనామా
- ప్పటికే తీసుకున్న సాదాబైనామా దరఖాస్తులను కొత్త చట్టం కింద చేసుకున్న దరఖాస్తులుగానే పరిగణించాలి. తద్వారా పెండింగ్లో ఉన్న 9.4లక్షల దరఖాస్తులు అలాగే కొనసాగుతాయి. స్టాంపు డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఫీజులను సమస్య పరిష్కరించే సమయంలో కట్టాల్సిన అవసరం ఇప్పుడు లేదు.కొత్తగా అమలు చేయబోయే చట్టం ద్వారా సదభైనమ సమ్యాలను పరిష్కరించేలా పొందు పరిచారు.కొత్త దరఖాస్తులలను పరిష్కారించే సమయంలో మాత్రం రిజిస్ట్రేషన్ రుసుము మరియు స్టాంప్ డ్యూటీకి సంభందించిన పైకం చెల్లించాల్సి ఉంటుంది.సాదాబైనామాల పరిష్కార అధికారం పాత చట్టంలో కలెక్టర్లకు ఉండగా..ఇప్పుడు కొత్త చట్టంలో ఆర్డీవోలకు కూడ అధికారాలు ఇవ్వడం జరుగింది.
5 thoughts on “Telangana New Revenue Act 2024: భూమి రిజిస్టర్”