Telangana Govt Stopping Rythu Bharosa farmers: ఎన్ని రోజులు ఐన ఈ రైతులకు రైతు భరోసా రాదు 2025

Telangana Govt Stopping Rythu Bharosa farmers

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా నిధులు నెమ్మదిగా రైతుల ఖాతాలో జమవుతున్నాయి అయితే దీనిపై రైతు భరోసా కు కోత విధించే అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి దాని గురించి ఒకసారి తెలుసుకుందాం….

Farmer telangana
Farmer telangana

రేవంత్ సర్కారు ఇటీవల రాష్ట్రంలో రైతులకు రైతు భరోసా నిధులను జమ చేస్తూ వస్తోంది ఇప్పటికే చాలా మటుకు రైతులకు రైతు భరోసా అనేది నుంచమాయ్యాయి మరి కొంతమంది రైతులకు జమ కావాల్సి ఉంది జమ కాని రైతులకు కోతలు విధించే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి కేవలం సాగుకు యోగ్యమైన భూములకు మాత్రమే ఇస్తానన్న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్వ చేరకపడంతో రైతు భరోసా కు కోతలు విధించే అవకాశాలు కనిపిస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తూ ఉన్నాయి.ముఖ్యంగా, ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఈ పథకానికి అర్హులు కాదని ప్రభుత్వం తేల్చిచెప్పినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అలాగే, ప్రభుత్వ ఉద్యోగుల పేరుపై ఉన్న భూములకు పెట్టుబడి సాయం అందించకూడదనే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనితో, రైతు భరోసాలో కోతలు అనివార్యమయ్యాయి.

Farmer
Farmer India

కౌలు రైతులకు రైతు భరోసా అందించాలనే హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం, ఇప్పుడు దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు కౌలు రైతుల పరిస్థితి ఏంటి నగానే పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రైతన్నలు అక్కడక్కడ పలుచోట్ల రైతులు ధర్నాలకు కూడా దిగుతున్నారు. రైతు భరోసానిధులు ఉద్యమకాపోవడంతో రైతు రుణమాఫీ చేస్తారా లేదా అనేది కూడా రైతుల ఆలోచనగా మిగిలిపోయింది.ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో రైతు భరోసా విడుదల నిలిచిపోయే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఈ పథకం గత ప్రభుత్వ హయాంలోనిదే కాబట్టి, కోడ్ ప్రభావం ఉండదని అధికారులు స్పష్టంచేశారు. అయినప్పటికీ, నిధుల విడుదల ఆలస్యమవుతుండటంతో రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

Farming
Farming

పరిశీలనలో భాగంగా 10 వేల ఎకరాలకు పైగా సాగుకు అనర్హమైన భూములను గుర్తించారు. ఇప్పుడు, అటువంటి భూములను తొలగించి మిగిలిన భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించారు. ఈ మార్పుల కారణంగా, రాష్ట్ర వ్యాప్తంగా 2.90 లక్షల మంది రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం అందనుంది. అయితే, గతంలో కంటే మొత్తం సాయం పెంచినందున, నిధుల కేటాయింపులో పెరుగుదల ఉంటుందని అంచనా.

Leave a Comment