Rain Floods: భారీ వర్షాలకు నీట మునిగిన 2 గ్రామాలు సహాయం కోసం ఎదురు చూపులు
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ తో పాటుగా పలు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు.
మహబూబా బాద్
రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండడంతో చాలామంది ప్రజలు ఇక్కట్లు పడుతూ ఉన్నారు హైదరాబాద్ తో పాటుగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒక్కో దగ్గర వంతెనలు పొంగి పొర్లుతున్నాయి. మహబూబాబాద్ జిల్లాల్లో ఈ రోజు ఉదయం నుండి భారీగా కురుస్తున్న వర్షాలకు కొన్ని చోట్ల రైల్వే వంతెనలు కూలిపోయాయి.
మహబూబాద్ జిల్లా మరిపెడ బంగ్లా మండలం ధర్మరొమ్ గ్రామానికి సమీపంలో ఉన్న సీతారాం తండా పూర్తిగా నీట మునిగింది దీంతో దిక్కు తచ్చని స్థాయిలో తండా వాసులు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. వడిగా వస్స్తున్న నీటి ప్రవాహం సీతారాం తండా పక్కనే ఉన్న బ్రిడ్జి కారణంగా గ్రామాల్లోకి వెల్లింది ఒక్కసారిగా నీళ్లు కమ్ముకోవడంతో చాలామంది ప్రజలు సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లారు. కొన్ని చోట్ల నీటి ప్రవాహానికి రైల్వే వంతెనలు కూలిపోయాయి దీంతో పలు రైళ్లను రూట్ మార్చడంతో పాటు మరికొన్ని రైళ్లను రద్దు చేశారు.దీంతో ఇరు తెలుగు రాష్ట్రాలకు ప్రయాణం సాగించాలని అనుకునే వారికి ఇబ్బందులు ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. పలు రైల్వే స్టేషన్స్ లో హెల్ప్లైన్ నంబర్స్ ఏర్పాటు చేసారు.
ఖమ్మం
కహమ్మలో నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఖమ్మం కి వెళ్లే కొన్ని రహదారులను రద్దు చేసినట్లు తెలిపారు . ఖమ్మంకి వెళ్లే త్రి టౌన్ బైపాస్ రోడ్డు రోడ్డు బ్రీజ్ పై నుండి ఉప్పొంగుతూ అహల్లాదకరంగా కనిపించింది .
సూర్యాపేట
సూర్యాపేట ఇళ్లలో నిన్నటి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొన్ని గుట్టలు మరియు కొండల్లో జలపాతాలు జాలు వారియె .ఫణిగిరి గ్రామం లోని బుద్ధ క్షేత్రంలో ఉన్న గుట్టల నుడి జలధార ఉప్పొంగి కొండల మీదుగా జారీ పడుతుండడంతో గ్రామా ప్రజలు చూడడానికి వెళ్తున్నారు.
విజయ వాడ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షాలకు అక్కక్కడ కొండా చరియలు విరిగిపడడంతో పాటు కొన్ని గ్రామాలూ నీటిమట్టం అయ్యాయి. కానక దుర్గ ఆలయం దగ్గర్లో కొండా చరియలు విరిగిపడ్డాయి. ఎలాంటి ప్రాణం నష్టం జగక పోవడంతో ఊపిరి పీల్చుకున్నారు .
భాగ్య నగరం
భాగ్యనగరంలో బజార్లన్నీ నీటిమట్టం అయ్యాయి. ఉస్మాన్ సాగర్ తో పాటు గండిపేట ,హుస్సేన్ సాగర్ హిమాయత్ సాగర్ కు వరద పోటెత్తింది .దీంతో అధికారులు పట్టాన ప్రజలను అప్రమత్తం చేశారు .డిజాస్టర్ సిస్టమ్ను అలెర్ట్ చేసి హెల్ప్లైన్ నంబర్స్ ఏర్పాటు చేసారు . హైద్రాబాద్లోని లోతట్టు ప్రాంతాలకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.అవసరం ఐతే తప్పు బయటకు రావొద్దని పోలీసులు తెలిపారు .భారీగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు భయ భ్రాంతులకు గురవుతున్నారు. చాల వరకు భాగ్యనగర విధుల్లో నీళ్లు నిలిచిపోవడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.హుసేన్ సాగర్ వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
ముగింపు
భారీగా వర్షాలు కురుస్తుండడంతో డ్యాముల్లోకి ,ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చి చేరింది. దీంతో పక్కనే ఉన్న గ్రామాలు మునిగిపోయాయి. కొన్ని చోట్ల రైల్వే వంతెనలు వరద తాకిడికి కొట్టుకు పోవడంతో ఆ దారిలో వెళ్లే రైళ్లను దారి మల్లించారు. కొన్ని రైళ్లను రద్దు చేశారు.గ్రేటర్లో కురుస్తున్న వర్షాలకు స్కూళ్లకు సెలవులు ఇచ్చారు .