MGNREGA 2024: ఉపాధి హామీ పథకం ద్వారా కేంద్రం 2 లక్షల సబ్సిడీ
కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు పూర్తి సబ్సిడీ తో కొత్త పథకాన్ని అమలులోకి తీసుకు వచ్చిముది.
కేంద్ర బ్రభుత్వం ఆర్ధికంగా సహాయం చేసాయడం కోసం ఎన్నో రకాల పథకాలను అందుబాటులోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే .అందులో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ,ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన లాంటి ఎన్నో పథకాలను రైతులను వృద్ధి దిశగా అడుగులు వెలిసేలా సహాయం చేస్తూ వస్తున్నాయ్. అలాగే రైతులను ఆర్గానిక్ వ్యవసాయం వైపు మల్లించడం కోసం వారికి 40 % సబ్సిడీ తో పీఎం ఆర్గానిక్ అనే పథకాన్ని అమలు చేసిన విష్యం తెలిసిందే. ఇప్పుడు కొత్తగా రైతుల కోసం కేంద్రం ఎలాంటి పథకాన్ని అమలులోకి తీసుకు వచ్చిమదే ఇప్పుడు చదువుదాం
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్వహిస్తున్న ఉపాధి హామీ పథకం (100 రోజుల పని) ద్వారా రైతులను ఉద్యాన వన పంటల వైపుకు ప్రోత్సహించేందుకు MGNREGA ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతులకు పూర్తి సబ్సిడీ తో మొక్కలను అందిస్తుంది. దీని ద్వారా అతి వృష్టి లేదా అణా వృష్టి ఏర్పడప్పుడు రైతులు అధునా మోతాదులో నష్టాలను ఎదుర్కోవాల్సిన పని ఉండదు అని తెలిపారు.
ఎవరు అర్హులు
ఈ ఉద్యాన వాన పంటల కోసం మొక్కలను రైతులు ఉచితంగా పొందాలి అంటే 5 ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉన్న రైతులు మాత్రమే ఈ పథకానికి అర్హులు . 5 ఎకరాల పై బడి ఉన్న రైతులు ఈ పథకానికి అనర్హులుగా కేంద్రం తేల్చింది.
ఎలా అప్లై చేసుకోవాలి
ఈ పథకాన్ని అప్లై చేసుకోవడానికి రైతులు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి వీలు కల్పించలేదు.ఈ పథకానికి అప్లై చేసుకోవాలి అనుకునే రైతులు తమ ఏవో లేదా MGNREGA కార్యాలయాన్ని సందర్సించాయాల్సి ఉంటుంది .వారిని సందర్సించి కావలసిన ఆధార పాత్రలను చూపించి వారి దగ్గరనుండి సమాచారం సేకరించి అప్లై చేసుకొవాలి .
ఏ పంటలకు సబ్సిడీ
మామిడి మొక్కల పెంపకం,పూలు,16 రకాల పండ్ల తోటలు పెంచాలి అనుకునే రైతులకు నర్సరీ ద్వారా మొక్కలను ప్రభుత్వమే ఉచితంగా అందించనుంది.
సబ్సిడీ ఎలా ఉంటుంది
రైతులు సబ్సిడీ పొందాలి అంతే కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది. అవి
- రైతులు ఒక ఎకరాకు 70 మామిడి మొక్కలు నాటుకోవాల్సి ఉంటుంది. ఆలా మామిడి తోటకు ఎకరాకు మొదటి ఏడాది రూ 51,367, రెండో ఏడాది రూ 28,550 మరియు మూడో ఏడాది రూ 30,000 రూపాయల చొప్పున మూడేళ్లకు 109,917 రూపాయలను సబ్సిడీ కింద అందించనుంది
- అదే విధంగా డ్రాగన్ ఫ్రూట్ ఎకరాకు 900 మొక్కలు నాటితే అందులో మొదటి ఏడాది రూ 1,62,514, రెండో ఏడాది రూ 17,250 మరియు మూడో ఏడాది రూ 20,950 రూపాయల చొప్పున మూడేళ్లకు 2,00,714 రూపాయలను సబ్సిడీ కింద అందించనుంది
అంతే కాకుండా నిమ్మ,దానిమ్మ,సీతాఫలం,జామ లాంటి తోటకు కూడా తోటలను బట్టి మొక్కలను నర్సరీ నుండి తెచ్చే ఖర్చు,రవాణా ఖర్చు,మరియు మొక్కలను పొలం లో నాటే ఖర్చును ప్రభుత్వమే భారయేస్తుంది.
కావలసిన పత్రాలు
భూమి పట్టా పాస్ బుక్ లేదా 1 బి అడగంల్
ఆధార్ కార్డు
100 రోజుల పని జాబ్ కార్డు
గమనిక : ఈ పథకానికి అప్లై చేసుకోవాలి అనుకునే రైతులు ఖచ్చితంగా మీ దగ్గరలోని ఉపాధి హామీ కార్యాలయానికి వెళ్లి పూర్తి సమాచారం సేకరించిన తరువాతే అప్లై చేసుకోగలరు